ముల్తానీమట్టి తో ఈ సమస్యలకి చెక్ పెట్టేయండి..!

-

ముఖం అందంగా ఉండాలని ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలని చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ పద్ధతుల్ని అనుసరించడం వివిధ రకాల ప్రోడక్ట్స్ వాడడం లాంటివి చేస్తూ ఉంటారు.అయితే ఇటువంటి సమస్యలకు ముల్తానీ మట్టి బాగా ఉపయోగపడుతుంది. పింపుల్స్, మచ్చలు వంటి వాటిని సులభంగా తొలగించడానికి ఇది బాగా సహాయపడుతుంది. అయితే ముల్తానీ మట్టి తో సులువుగా పింపుల్స్, మచ్చలు వంటి వాటిని ఎలా తొలగించుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముల్తానీ మట్టి కర్పూరం ఫేస్ ప్యాక్:

కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. చర్మ సమస్యల్ని పోగొట్టడంలో ముడుతలు వంటి వాటిని తొలగించడంలో బాగా ఉపయోగపడుతుంది. ముల్తానీ మట్టి అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ రెండిటినీ కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు.

దీని కోసం ముందుగా మీరు రెండు స్పూన్లు ముల్తానామట్టి ఒక కప్పులో వేసి దానిలో ఒక చిన్న ముక్క కర్పూరం వేయండి. ఈ రెండిట్లో రోజ్ వాటర్ వేసి మిక్స్ చేయండి.

మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తుడిచి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించండి. ఒక పదిహేను నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని మాయిశ్చరైజర్ రాసుకోండి.

ముల్తాన్ మట్టి రాసినప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి:

ముల్తానీ మట్టి లో నిమ్మ రసం వేసుకోవడం వల్ల ముఖం అంతా దురదలు వస్తాయి. అదే విధంగా పింపుల్స్ కి కూడా దారి తీస్తాయి. అలాగే ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని మరింత డ్రైగా మార్చేస్తుంది. కాబట్టి వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవడం మంచిది. ఇలా ఈ ఫేస్ ప్యాక్ ని ఉపయోగించడం వల్ల సులువుగా సమస్యల నుంచి బయట పడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news