ముఖం మీద మచ్చలు వేగంగా తొలగిపోవాలంటే ఇలా చెయ్యండి..!

-

నిమ్మ వల్ల కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు. అందానికి కూడా ఎంతో ఉపయోగకరం. చాలా మంది మచ్చలని తొలగించుకోవడానికి, గ్లో పెంచుకోవడానికి మార్కెట్ లో దొరికే అనేక ప్రొడక్ట్స్ ని ట్రై చేస్తూ ఉంటారు. కానీ సులువైన ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే మచ్చలు వంటివి త్వరగా పోతాయి అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి ఆలస్యం ఎందుకు ఆ చిట్కాల గురించి ఇప్పుడు చూద్దాం.

నిమ్మ లో ఎసిడిక్ రుచి ఉంటుంది. ఇది చెడు మలినాలని, జిడ్డుని, ఆయిల్ ని తొలగిస్తుంది. అదే విధంగా మృత చర్మాన్ని కూడా ఇది తొలగిస్తుంది. దీనిని వాడడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

చల్లటి పాలలో కొద్దిగా నిమ్మరసం కొద్దిగా బాదం పొడి లేదా కమలా తొక్కలు వేసి గ్రైండ్ చేసి దానిని
అప్లై చేసుకుని  పది నిమిషాల పాటు అలాగే వదిలేసి గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే మీరే మార్పును గమనించవచ్చు.

అదే ఒకవేళ ఆయిల్ స్కిన్ వాళ్ళకు అయితే కొద్దిగా పసుపు దానిలో రెండు టేబుల్ స్పూన్లు నిమ్మ రసం మూడు టీస్పూన్లు బొప్పాయి గుజ్జు వేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

డ్రై స్కిన్ వాళ్లు అయితే మూడు టీస్పూన్లు నిమ్మరసంలో కొద్దిగా తేనె మరియు ఒక అర టీ స్పూన్ ఉడికించిన క్యాబేజీ వేసి ముఖానికి మెడకు అప్లై చేసుకుని పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే మంచి ప్రయోజనం పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news