చర్మం పొడిబారటం, కళ్ల కింద ఉబ్బడం.. దెబ్బతింటున్న కిడ్నీలకు సంకేతమే..!

-

కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే..ఆ వ్యక్తి మొత్తం ఆరోగ్యం దెబ్బతిన్నట్లే.. బాడీలో వ్యర్థాలు, అదనపు ద్రవాలు పేరుకుపోతాయి. మన బాడీలో కిడ్నీలు చాలా ముఖ్యమైన పనులు నిర్వర్తిస్తాయి. రక్తంలో నీరు, సోడియం, కాల్షియం, భాస్వరం, పొటాషియం వంటి మూలకాలను మూత్రపిండాలే సమతుల్యం చేస్తాయి. అయితే ఇవి దెబ్బతింటే మళ్లీ కోలుకోవడం కష్టం.. పగిలిన అద్దాన్ని ఎలా అయితే సాధారణ స్థితికి తేలేమో.. దెబ్బతిన్న మూత్రపిండాలు అంతే.. కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇవి కాస్త డేంజర్‌లో పడుతున్నాయి అన్నప్పుడే మనకు కొన్ని సంకేతాలు ఇస్తాయి. వాటిని సరిగ్గా తెలుసుకుంటే సమస్య ఉండదు.. అవేంటంటే..

చర్మ సమస్యలు: కిడ్నీ సరిగా పనిచేయకపోతే చర్మం పొడిబారడం, పొట్టు, దురద వంటి సమస్యలు వస్తాయి..నిజానికి కిడ్నీలు మన రక్తంలోని టాక్సిన్‌లను ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన రక్తాన్ని చర్మానికి అందిస్తాయి. ఇవి సరిగ్గా పని చేయకపోతే, వివిధ చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మన రక్తంలో విషపదార్థాల పెరుగుతాయి.

కంటి సమస్యలు- కిడ్నీలో ఎలాంటి సమస్య వచ్చినా సరే ఆ ప్రభావం కళ్ల మీద పడుతుంది. మీ కళ్ల చుట్టూ వాపు వచ్చినట్లు అనిపించినా.. కంటి చూపు స్పష్టంగా లేకపోయినా..? అటువంటి పరిస్థితిలో, మీ కిడ్నీలను పరీక్షించుకోవాలని నిపుణులు అంటున్నారు.

కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శరీరంలో ఎప్పుడూ నీటి కొరత రాకూడదు. రోజూ బాడీకీ సరిపడినంత నీరు ఇవ్వాలి. అంటే మనం అన్ని వాటర్‌ తాగాలి. కిడ్నీ ప్రభావితమైతే శరీరం మొత్తం ప్రభావితమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, దాని గురించి అజాగ్రత్తగా ఉండకూడదు. సాధారణంగా మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలు కిడ్నీ ఫెయిల్యూర్‌కు సంకేతాలుగా కనిపిస్తాయి. ఎప్పుడూ టాయిలెట్‌ను హోల్డ్‌ చేసుకోవద్దు. చాలామంది వివిధ కారణాలతో టాయిలెట్‌ వచ్చినట్లు అనిపించిన వెంటనే వెళ్లరు. అలానే బిగపట్టుకుని ఉంటారు. దీని వల్ల కిడ్నీలు తొలగించిన వ్యర్థాలనే మళ్లీ క్లీన్‌ చేయాల్సి ఉంటుంది. చేసిన పనే రెండో సారే చేస్తే మరి పెండింగ్‌లో ఉన్న వ్యర్థాలు క్లీన్‌ చేయడానికి టైం పడుతుందిగా.. దాని వల్ల మనకే కదా నష్టం..!

Read more RELATED
Recommended to you

Latest news