లిక్కర్ స్కామ్..కవిత చుట్టూనే..!

-

మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్..రెండు తెలుగు రాష్ట్రాలని వణికిస్తుంది…ఈ స్కామ్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు ఉన్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఈ స్కామ్‌లో ఉన్నట్లు కొన్ని రోజులు క్రితమే ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు ఆరోపించారు. అందులో తనకు ఏ మాత్రం సంబంధం లేదని కవిత క్లారిటీ ఇచ్చారు. అయినా సరే ఆ స్కామ్..కవిత చుట్టూ తిరుగుతూనే ఉంది. కవిత సన్నిహితులని వార్తలు వచ్చిన బోయినపల్లి అభిషేక్‌రావు, ప్రేమ్‌సాగర్‌ నివాసాల్లో కూడా ఈడీ తనిఖీలు చేసినట్లు కథనాలు వచ్చాయి.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యాపారి రామచంద్రన్‌ పిళ్లైకి చెందిన సంస్థలు, నివాసంలో ఈడీ అధికారులు ఇప్పటికే తనిఖీలు చేయగా, తాజాగా మరోసారి తనిఖీలు నిర్వహించారు. ఇదే క్రమంలో కవితకు ఆడిటర్‌గా వ్యవహరిస్తున్న గోరంట్ల బుచ్చిబాబు కార్యాలయంలోనూ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. ఇప్పటికే క‌విత పీఏగా ప‌నిచేస్తున్న అభిషేక్ రావు ఇంట్లో ఈడీ ఇప్పటికే సోదాలు చేసింది. నోటీలుసు అందుకున్న వారిలో శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, బోయిన్ పల్లి అభిషేక్‌ రావు, ప్రేమ్‌సాగర్‌రావు, అరుణ్ పిళ్ళై ఇతరులు ఉన్నారు.

అయితే నోటీసుల జారీకి సంబంధించి ఈడీ అధికారులు మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. కానీ, కవితకు కూడా నోటీసులు ఇచ్చారంటూ ప్రచారం జరిగింది. కవితకు కరోనా సోకడంతో ప్రస్తుతం ఆమె క్వారంటైన్‌లో ఉన్నారు. దీంతో ఆమె సహాయకులకు నోటీసులు ఇచ్చారంటూ వార్తలు వెలువడ్డాయి. కానీ, ఈ ప్రచారాన్ని కవిత ఖండించారు. ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.

ఇక ఇంత జరుగుతున్నా కవితకు నోటీసులు రాలేదనే చెబుతున్నారు..మరి ఇందులో కవిత చెప్పేది నిజమూ…లేక మీడియా చెప్పేది నిజమో క్లారిటీ లేకుండా ఉంది. మొత్తానికైతే కవిత చుట్టూనే లిక్క స్కామ్ ఉచ్చు బిగుస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news