అమ్మాయిలూ.. గోర్లు వేగంగా పెరగాలా.. ఈ ఇంటి చిట్కాలు పాటించేయండి..!

-

అమ్మాయిలకు చేతివేళ్ల గోళ్లను పెంచడం అంటే..ఒక పిచ్చి. ఇంతింత పొడువున మంచి షేప్స్ తో తెగ పెంచుతారు. అది చూసిని మిగతా అమ్మాయిలు కూడా మనం పెంచుకుందాం అని ట్రై చేస్తారు కానీ.. కొందరికి అసలు గోళ్లు పెరగవు. ఒకవేళ పెరిగినా కాస్త పొడవుగా అయ్యేలోపే టప్ మని విరిగిపోతాయి. ఇక సగంసగం విరిగిన వాటిని చూస్తే మనకు అస్సలు నచ్చదు.. మొత్తానికే పీకేస్తాం.. ఇలా పాపం కొందరు అమ్మాయిలకు గోళ్లను పెంచుకోవాలని ఆశ ఉన్నా..అవి సరిగ్గా పెరగక వదిలేస్తున్నారు. మీలాంటి వారికోసం ఈ టాపిక్. గోళ్లను ఎలా అందంగా పెంచుకోవచ్చో చూసేద్దాం. అయితే ఒక మాట.. గోళ్లను పెంచుకోవానుకునేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిల్లో ఎలాంటి డర్టీ చేరకుండా చూసోకోవాలి. లేదంటో ఆరోగ్యానికి దెబ్బ.

పాలు , పెరుగు : 2 టేబుల్ స్పూన్లు పాలు, టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోని ఆ మిశ్రమంలో గోళ్లను ముంచి సుమారు 15 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత బయటకు తీసి చేతులను బాగా కడగాలి. రోజుకు ఇలా రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గోర్లు ఆరోగ్యంగా పెరుగుతాయి.

ఆరెంజ్, నిమ్మ : కప్పు నారింజ రసం, టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. ఒక గిన్నెలో, కొద్దిగా నారింజ రసం , కొంచెం నిమ్మరసం వేసి రెండు పదార్థాలను బాగా కలపాలి. వేలుగోళ్లను ఈ మిశ్రమంలో 15 నిమిషాలపాటు ఉంచాలి. తరువాత చల్లని నీటితో చేతులు క్లీన్ చేసుకుంటే సరి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే గోర్లు త్వరగా పెరగటంతోపాటు బలంగా ఉంటాయి.

అవోకాడో, కివి,హనీ ; అవోకాడోస్ , కివిలో జింక్ పుష్కలంగా ఉంటుంది, ఇవి గోర్లు ఆరోగ్యంగా వేగంగా వృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయి. జింక్ లోపం వల్ల గోళ్ళపై తెలుపు రంగు మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. టేబుల్ స్పూన్ అవోకాడో గుజ్జు, టేబుల్ స్పూన్ కివి గుజ్జు, టేబుల్ స్పూన్ తేనె తీసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఆ పేస్ట్ ను వేలు గోళ్లపై అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీళ్లతో కడిగి పొడి టవల్ తో తుడవాలి. డైలీ టూ టైమ్స్ చేయాలి.

ఫిష్ ఆయిల్ ; ఫిష్ ఆయిల్‌లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి, గోళ్లను తేమగా ఉంచేందుకు ఈ అమ్లాలు సహాయపడతాయి. చేప నూనెను తీసుకుని అందులో దూదిని ముంచి ఆనూనెను వేళ్ల గోర్లపై అప్లై చేయాలి. అరగంటపాటు అలాగే ఉంచాలి. తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయటం వల్ల గోర్లు బాగా పెరగటంతోపాటు అందంగా ఉంటాయి.

అరటి పండు, కోడి గుడ్డు ; కోడిగుడ్డు, అరటి పండు గోర్ల బలాన్ని మెరుగుపరుస్తాయి ఈ రెండింటిలో బయోటిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది గోర్లు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.. 2టేబుల్ స్పూన్ మెత్తని అరటి గుజ్జు, ఒక కోడి గుడ్డు తీసుకోవాలి. చిన్న గిన్నెలో కోడిగుడ్డు పగులగొట్టి సొనవేయాలి. మెత్తిని అరటిగుజ్జు వేసి రెండు పదార్ధాలను కలిపి పేస్ట్ లా చేయాలి. ఆ గిన్నెలో మీ చేతి వేళ్ల గోర్లను 15 నిమిషాలపాటు ఉంచాలి. అనంతరం చల్లని నీటితో కడిగి టవల్ తో తుడుచుకోవాలి. రోజులో ఇలా రెండు సార్లు చేస్తే గోర్లు వేగంగా పెరుగుతాయి.

వీటిల్లో ఏదో ఒకటి మీకు వీలైంది ఎంచుకుని డైలీ టూ టైమ్స్ చేస్తుంటే.. మీ గోర్లు వేగంగా, బలంగా పెరుగుతాయట.

Read more RELATED
Recommended to you

Latest news