ఉల్లితో జుట్టు సమస్యలకి చెక్..!

-

మంచి అందమైన కురులు సొంతం చేసుకోవాలని ఎవరికి ఉండదు. మంచి ఆరోగ్యకరమైన జుట్టు పొందడానికి ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి. ఉల్లి రసం జుట్టు hair పెరుగుదలకు బాగా ఉపయోగ పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ సెప్టిక్ గుణాలు, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.

జుట్టు/ hair
జుట్టు/ hair

అదే విధంగా దీని వలన సూర్య కిరణాల నుండి కూడా జుట్టుని రక్షిస్తుంది. ఇలా ఉల్లి రసం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు.

ఉల్లి మరియు తేనె:

జుట్టు ఎక్స్పర్ట్స్ అద్భుతమైన చిట్కాలుని మనతో షేర్ చేసుకున్నారు. కనుక అనుసరిస్తే అందమైన కురులు మీ సొంతం చేసుకోవచ్చు. పొడిబారిపోయిన జుట్టుకి ఉల్లి రసంతో పాటు తేనె కలిపి రాయడం వల్ల జుట్టు హైడ్రేట్ గా ఉంటుంది మరియు ఆరోగ్యంగా ఉంటుంది.

దీని కోసం మీరు ఈ విధంగా పాటించండి. ఉల్లి రసాన్ని తేనెలో కలిపి మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని జుట్టు అంతటికీ కూడా పట్టించండి. ఆ తర్వాత దానిని అరగంట నుండి గంట సేపు వదిలేసి షాంపూ తో జుట్టుని వాష్ చేసేయండి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేయొచ్చు. దీని వల్ల జుట్టు పొడిబారకుండా హైడ్రేట్ గా ఉంటుంది. అదే విధంగా అందంగా కూడా ఉంటుంది.

ఉల్లి రసం మరియు నిమ్మ:

మంచి ఆరోగ్యకరమైన జుట్టు పొందడానికి ఉల్లి రసం తో నిమ్మ రసం కలిపి పట్టిస్తే మంచిది. హెయిర్ ఫాలికల్స్ ని ఇది బలపరుస్తుంది. అలానే చుండ్రుని కూడా ఇది తొలగిస్తుంది.

ఉల్లి రసం మరియు నిమ్మరసం ఇలా వాడండి. ఉల్లి రసంలో కొద్దిగా నిమ్మ రసాన్ని కలిపి జుట్టుకి అప్లై చేయండి. అరగంట పాటు వదిలేసి షాంపూతో జుట్టుని కడిగేయండి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news