కేశ సంరక్షణ: జుట్టుకి రంగు వేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్.

-

జుట్టుకి రంగేయడం ఇప్పట్లో కామన్ అయిపోయింది. యువతలోనూ ఈ ధోరణి విపరీతంగా కనిపిస్తుంది. మారుతున్న జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు దానికి కారణంగా నిలుస్తున్నాయి. ఐతే జుట్టుకి రంగు వేసేవారు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. లేదంటే అందులోని రసాయనాలు జుట్టుకి మరింత చేటు చేస్తాయి. ఆ జాగ్రత్తలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

షాంపూ వదిలేయండి.

రంగు వేసుకునే రోజు షాంపూ వాడవద్దు. రంగు వేసుకునే ముందు కూడా షాంపూ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. జుట్టులో ఉత్పత్తి అయ్యే సహజ సిద్ధమైన ఆయిల్స్ మాత్రమే రంగు వేసుకోవడం వల్ల వచ్చే దురద, చికాకుని దూరం చేస్తుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి.

టెస్ట్

ఏ బ్రాండ్ రంగు అయినా సరే మొదటి సారి ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. అది మీ జుట్టుకి ఎలా పనిచేస్తుందో తెలియకుండా అప్లై చేయడం కరెక్ట్ కాదు. కొత్త బ్రాండ్ రంగు వేయాలనుకున్నప్పుడల్లా ప్యాచ్ టెస్ట్ చేయండి. కొద్ది పాటి జుట్టుకి కొంత రంగు పూస్తే సులభంగా అర్థమైపోతుంది.

సున్నితత్వం

మీ శరీరంలో అన్నింటికంటే సున్నితమైనది చర్మమే. అందువల్ల రంగు కారణంగా చర్మానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. దానికోసం రంగులో కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ కలుపుకుంటే బాగుంటుంది. అది అమోనియాతో కలిసి పీహెచ్ స్థాయిలను సరిగ్గా ఉంచుతుంది. కలర్ బాక్స్ మీద ఉన్న సూచనలను బట్టి ఎంత మేర హైడ్రోజన్ పెరాక్సైడ్ కలుపుకుంటే మంచిదో చెక్ చేసుకోండి.

నీళ్ళతో కలపకండి

ఎక్కువ నీళ్ళని రంగులో పోయవద్దు. ఎంత మిక్స్ చేసినా దానివల్ల పెద్దగా ఫలితం ఉండదు. అది గ్రీజు మాదిరిలా మారుస్తుందే తప్ప ఫలితాన్ని మార్చదు.

పెట్రోలియం జెల్ మిక్స్ చేయండి.

రంగు వేసుకోవడానికి ముందు పెట్రోలియం జెల్లి రాస్తే బాగుంటుంది. చర్మాని అంటుకున్న రంగు తొందరగా తొలగిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news