ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే 2021: చరిత్ర.. ప్రాముఖ్యత.. విశేషాలు.. కొటేషన్లు.

-

ప్రపంచ ముద్దు దినోత్సవాన్ని ప్రతీ ఏడాది జులై 6వ తేదీన జరుపుకుంటారు. యునైటెడ్ కింగ్ డమ్ లో మొదటిసారిగా కిస్సింగ్ డే జరుపుకున్నారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా 2000సంవత్సరం నుమ్డి జరుపుకుంటున్నారు. ఇద్దరి మధ్య అనుబంధాన్ని తెలియజేసేందుకు గుర్తుగా కిస్సింగ్ డే జరుపుకుంటారు.

ప్రకృతి మనిషికి ఇచ్చిన అందమైన బహుమతుల్లో ముద్దు ఒకటి. మాటల్లో చెప్పలేని ప్రేమను చేతల్లో చూపించేదే ముద్దు. ఒక్క ముద్దు ఎన్నో అనుభూతులను పంచుతుంది. ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. కొత్త బలాన్ని ఇస్తుంది. నరనరాలను ఉత్తేజ పరుస్తుంది. తనువంతా గాల్లో తేలుతున్న ఫీలింగ్ కలిగిస్తుంది. ఇద్దరు ప్రేమికుల మధ్య ముద్దుకి ఎన్నో అర్థాలు ఉన్నాయి.

నుదుటిపై ముద్దుకి నువ్వంటే నాకిష్టమని,
చెంపమీద ముద్దుకి నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలని,
పెదవులపై ముద్దుకి నిన్ను వదిలి ఉండలేనని.. అర్థాలు కనిపిస్తాయి.

మహమ్మారి వలన మీరు వెళ్ళలేక, మీకు దూరంగా ఉన్న మీ ప్రియమైన వారికి, ముద్దులతో కూడిన సందేశాలను ఈ విధంగా పంపించండి.

మాటల ప్రవాహం ఎక్కువైనపుడు దాన్ని ఆపడానికి ప్రకృతి కనిపెట్టిన అత్యంత విలువైనదే ముద్దు.. బర్గ్ మన్

నన్ను ముద్దు పెట్టుకో.. అప్పుడే నేను నీకు ఎంత ముఖ్యమో అర్థం అవుతుంది.. సిల్వియా ప్లాత్

నువ్వెప్పుడూ నాకు కొత్తగానే కనిపిస్తావు. నిన్ను ముద్దు పెట్టుకున్నప్పుడలా ఆ విషయం నాకు తెలుస్తూనే ఉంటుంది.

నుదుటిపై స్నేహపు ముద్దుతో ఈరోజుకి వీడ్కోలు. కనురప్పలపై ప్రేమ ముద్దుతో నీ స్వప్నలోకాలకు ఆహ్వానం. నిద్రపోయి తొందరగా వచ్చెయ్యి. కలల ప్రపంచంలో నీకోసం వేచి ఉంటాను.

ముద్దు ముత్యపు సేరు.. కౌగిలి కాసుల పేరు.. యండమూరి వీరేంద్రనాథ్.

Read more RELATED
Recommended to you

Latest news