జుట్టు సమస్య అనేది.. ఏ కాలంలో అయినా.. అందరినీ వేధిస్తూనే ఉంటుంది. ఇంకా ఈ సమ్మర్ లో.. ఆయిల్ పెడితే.. అసలే ఎండకు ఆ జిడ్డు చిర్రెత్తుతుంది. అలా అనీ.. ఏ ఆయిల్ పెట్టకుండా ఉంచితే.. వరిగడ్డి వాములా తయారవుతుంది. చివర్లు చీలిపోవడం, జుట్టు చిట్లడం వంటి సమస్య ఎదురవుతుంటుంది. ఈ సమస్యలన్నింటికి.. అవకాడో అద్భుతంగా పనిచేస్తుంది. అవకాడో ఆరోగ్యానికే కాదు.. ఇలా వాడితే అందానికి కూడా ఉపయోగపడుతుంది.
డీప్ కండిషనింగ్‌గా పనిచేస్తుంది. ఇది జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అవకాడోను ఉపయోగించి అనేక రకాల హెయిర్ మాస్క్‌లను కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి జుట్టుకు చాలా మేలు చేస్తాయి.
అవోకాడో గుజ్జు: ముందుగా అవకాడోను సగానికి కోయండి. దాని విత్తనాలను తొలగించండి. అనంతరం ఫోర్క్‌తో మెత్తగా చేయాలి. పేస్ట్ లాగా మారిన తర్వాత వెంట్రుకలు కాస్త తడిగా చేసి.. అప్లై చేయండి. ఆ తర్వాత వేళ్లతో తలను కాసేపు స్లోగా మసాజ్ చేయండి. అనంతరం ఒక గంటపాటు అలాగే ఉంచి.. తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోండి. వారానికి 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అవోకాడో – పెరుగు హెయిర్ మాస్క్- ముందుగా పండిన అవకాడోను తీసుకోని..దానికి కట్ చేసి..గుజ్జు తీసి దానికి 2 నుంచి 3 చెంచాల పెరుగు వేయండి.. ఈ హెయిర్ మాస్క్‌ని జుట్టు మీద అప్లై చేయండి. దీన్ని జుట్టు, స్కాల్ప్ అంతా అప్లై చేసి మసాజ్ చేసుకోండి. 30 నుంచి 40 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని.. ఆ తర్వాత షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. వారానికి 1 నుంచి 2 సార్లు ఉపయోగిస్తే హెయిర్ సాఫ్ట్ గా ఉంటుంది.
అవోకాడో – బనానా హెయిర్ మాస్క్: దీని కోసం అవోకాడోను సగానికి కట్ చేసి బ్లెండర్లో వేసి.. అరటిపండును వేసి పేస్ట్ చేయండి. ఈ గుజ్జును జుట్టు, తలకు పట్టించండి. కాసేపు మసాజ్ చేసి గంటపాటు ఉంచి శుభ్రం చేసుకోవాలి. మీరు దీన్ని వారానికి 1 నుంచి 2 సార్లు ఉపయోగించవచ్చు.
అవోకాడో – ఆలివ్ ఆయిల్: పండిన అవోకాడో తీసుకోండి. దానిని సగానికి కట్ చేసి గుజ్జు తీయండి. దానికి 1 నుంచి 2 టీస్పూన్ల కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్ కలపండి. అనంతరం మెత్తగా చేసి ఈ హెయిర్ మాస్క్‌ని జుట్టు, తలపై అప్లై చేయండి. కాసేపు మసాజ్ చేసి గంటపాటు ఉంచి తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. మీరు దీన్ని వారానికి రెండు సార్లు వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది.