నీళ్లలో పాలు కలిపి స్నానం చేస్తే… స్కిన్‌ గ్లోయింగ్‌ మూములగా ఉండదుగా..!

-

పాలలా తెల్లని చర్మం కావాలంటే..అవి ఇవి ఎందుకు ఏకంగా పాలనే ముఖానికి వాడేస్తే సరిపోతుంది కదా..! పాలు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మేలు చేస్తాయి. చాలా మంది పాల మీగడను ముఖానికి రాసుకుంటారు. దీని వల్ల ముఖం అంతా కంపు కొడుతుంది, జిడ్డుగా మారుతుంది. అయితే ముఖం ఛాయ మారుతుంది అనుకోండి.. అయితే పాలను స్నానం చేసే నీటిలో వేసుకుని చేయడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు సౌందర్య నిపుణులు..పాలు కొనుక్కోని తాగడానికే లేదు.. అసలే జీఎస్టీలతో సచ్చిపోతుంటే మీరేంటండీ నీళ్లలో పోసుకుని స్నానం చేయమంటున్నారు అని అనుకుంటారామో.. ఎంతో ఖర్చు పెట్టి ఏవేవో రసాయనాలు ఉన్న క్రీమ్స్‌ వాడేకన్నా..కూసంత ఖరీదైనా పాలు వాడటంలో తప్పులేదగా..!!
నీటిలో పాలు కలిపి స్నానం చేస్తే..
చర్మం మెరుస్తుంది: నీళ్లలో పాలు కలిపి స్నానం చేస్తే ముఖంపైనే కాకుండా శరీరం మొత్తం మెరుస్తుంది. శరీర ఛాయను మెరుగుపరుస్తుంది. ఇంకా శరీరం పై ఉన్న మచ్చలను దూరం చేస్తుంది. టానింగ్‌ను కూడా తొలగిస్తుంది.
పొడి చర్మం సమస్యను దూరం చేస్తుంది: పొడి చర్మం సమస్య ఉంటే.. రోజూ స్నానం చేసే నీటిలో అర గ్లాసు పాలు కలపి స్నానం చేయవచ్చు. ఇది చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేయడంలో సహాయపడుతుంది. ఎల్లప్పుడూ తేమ ఉండేలా చేస్తుంది. డ్రై స్కిన్‌ని దూరం చేస్తుంది. స్కిన్‌ కూడా సాఫ్ట్‌గా ఉంటుంది.
చర్మ అలర్జీలను దూరం చేస్తుంది: స్కిన్ అలర్జీ సమస్యలు ఏవైనా ఉంటే… ఉంటే నీరు, పాల మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అలర్జీలు, దురద మొదలైన సమస్యలు తగ్గుతాయి. చర్మం బిగుతుగా మారడానికి కూడా కారణమవుతుంది. అంతే కాదు రోజూ పాల నీళ్లతో స్నానం చేస్తే వృద్ధాప్య లక్షణాలు కూడా తక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడిప్పుడే ముఖం పై ముడతలు పడే స్టేజ్‌కు ఎంటర్‌ అయితే ఈ చిట్కా పాటించండి. మీకు ఒక డౌట్‌ రావొచ్చు. పాలతో స్నానం చేయడం వల్ల మన దగ్గర పాల వాసన వస్తుందేమే అని.. అలా ఏం ఉండదు.. మీరు నీళ్లలో పాలు కలుపుతన్నారంతే..మళ్లీ మీ సబ్బును ఎలాగూ వాడతారు కాబట్టి వాసన రాదు.!

Read more RELATED
Recommended to you

Latest news