అందంగా కనిపించాలనుకునే పెళ్ళి కూతుళ్ళు తెలుసుకోవాల్సిన చర్మ సంరక్షణ విషయాలు.

-

పెళ్ళి Marriage దగ్గర పడుతున్నకొద్దీ అందం విషయంలో ఒక రకమైన టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. ఒక చిన్న మొటిమ ఏర్పడినా ఆ టెన్షన్ ఇంకా పెద్దదవుతుంది. అందుకే పెళ్ళికి ముందు అందం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. కానీ, అందుకోసం ఏం చేయాలో సరిగ్గా తెలుసుకోరు. దానివల్ల చర్మ సంరక్షణ దెబ్బతింటుంది. మరికొద్ది రోజుల్లో పెళ్ళికూతురు ప్రతీ అమ్మాయి తమ చర్మ సంరక్షణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

మొదటగా, జంక్ ఫుడ్ పూర్తిగా వదిలేయండి. ప్రాసెస్ చేసిన మాంసహారాలను అస్సలు ముట్టుకోవద్దు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోండి. కావాల్సినన్ని నీళ్ళు తాగండి. రోజులో కనీసం 7-8గంటలు నిద్రపోండి. ఇంకా స్క్రీన్ టైమ్ ని బాగా తగ్గించండి. దానివల్ల కళ్ళ కింద నల్లటి వలయాల బెడద ఉండదు. ఒకవేళ ఆల్రెడీ నల్లటి వలయాలు ఇబ్బంది పెడుతున్నట్లయితే రాత్రి పడుకునే ముందు బాదం నూనె ఆ వలయాల భాగాల్లో వర్తించాలి. దీనివల్ల నల్లటి వలయాలు తగ్గిపోతాయి.

చర్మం పొడిబారకుండా ఉండేందుకు మాయిశ్చరైజర్ తప్పనిసరిగా వాడండి. అలాగే పెళ్ళి పనుల్లో షాపింగ్ అని బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అలాంటపుడు సన్ స్క్రీన్ లోషన్ వాడడం తప్పనిసరి. విటమిన్ సి, హ్యాలూరోనిక్ ఆమ్లాలు ఉన్న చర్మ సాధనాలు వాడితే బాగుంటుంది. ఏడి వాడాలనుకున్నా ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతే కొనసాగించండి. లేదంటే అనవసరమైన అనర్థాలను కోరి తెచ్చుకున్నవాళ్ళు అవుతారు. చర్మంలో నీటి శాతం తగ్గి పొడిబారుతున్నట్టుగా అనిపిస్తే బొప్పాయి. నారింజ తొక్క, టమాట, పసుపు వంటి వాటితో తయారయ్యే ఫేస్ మాస్కులను వర్తించండి.

Read more RELATED
Recommended to you

Latest news