మొటిమలు పోగొట్టుకోవడానికి ఎన్నో ట్రై చేసుంటారు. ఒకసారి ఇది కూడా ప్రయత్నించండి.

-

ముఖంపై ఏర్పడే మచ్చలు మొటిమల కారణంగానే తయారవుతాయి. మొటిమలు ఒక పట్టాన పోవు. వాటిని పోగొట్టుకోవడానికి మార్కెట్లో ఉన్న ఏవేవో ప్రోడక్ట్స్ వాడుతుంటారు. ఆ ప్రోడక్ట్స్ వల్ల మొటిమలు తగ్గిపోయినా అవి చేసిన మచ్చలు మాత్రం అలాగే ఉండిపోతాయి. అప్పుడు మచ్చలు పోగోట్టుకోవడానికి మరో ప్రోడక్ట్ కొనడానికి వెళతాం. అదెంత వరకు పనిచేస్తుందో తెలియదు.ఈ మేరకు మార్కెట్లో ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటన్నింటిని పక్కన పెడితే మచ్చలను పోగొట్టే ఔషధం ఇంట్లోనే తయారు చేసుకునే విధానం గురించి ఈ రోజు తెలుసుకుందాం. దీనివల్ల మొటిమలు పోవడమే కాదు, అవి పోతూ పోతూ వదిలేసిన మచ్చలు కూడా కనిపించకుండా పోతాయి.

దీనికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం.

బియ్యపు పిండి.. కప్పులో మూడవ వంతు తీసుకోవాలి.
గ్రీన్ టీ పౌడర్.. రెండు టీ స్పూన్లు.
పసుపు.. ఒక టేబుల్ స్పూన్.
శనగపిండి.. కప్పులో మూడవ వంతు..
రోజ్ వాటర్..

వీటన్నింటినీ దగ్గర పెట్టుకుని, ముందుగా శనగపిండిని గ్రీన్ టీ పౌడర్ తో కలుపుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత దీన్లో పసుపు, బియ్యపు పిండి కలుపుకుని బాగా కలపాలి. ఈ నాలుగింటి మిశ్రమాన్ని బాగా కలుపుకున్నాక దాన్లో రోజ్ వాటర్ కులుపుకుని పెట్టుకోవాలి. మిశ్రమం బాగా కలిసిందన్న నమ్మకం వచ్చిన తర్వాత ఒక గాజు గ్లాసులోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని రోజూ పడుకునే ముందు మొహానికి రాసుకోవాలి. ఎక్కడైతే మొటిమలు, మచ్చలు ఉన్నాయో అక్కడ బాగా అప్లై చేసుకోవాలి. ఇక్కడ మిశ్రమం మొహానికి అప్లై చేసేముందు శుభ్రంగా కడుక్కోవాలన్న విషయం మర్చిపోకూడదు. రాత్రంతా అలానే ఉంచుకుని ఉదయం లేవగానే మొహాన్ని ఫ్రెష్ గా కడుక్కోండి.

రోజూ ఇలా చేయడం వల్ల కొద్ది రోజులకి మొటిమలు తగ్గిపోవడం, వాటి స్థానే ఏర్పడిన మచ్చలు మాయమవడం మీరు గమనిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news