ముఖంపై వెంట్రుకలు తొలగించేందుకు ఇంట్లో తయారు చేసుకునే ఫేస్ మాస్క్.. ఇలా చేయండి..

ముఖంపై వెంట్రుకలు అందానికి ప్రతిబంధకంగా కనిపిస్తాయి. గడ్డంపై చిన్న చిన్నగా కనిపించే వెంట్రుకలు తొలగించుకోవడానికి పార్లర్ కి వెళ్తుంటారు. కానీ ఇప్పుడు కరోనా టైమ్.సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయాల్లో పార్లర్ కి వెళ్ళడం సరైనది కాదు. కాబట్టి, ఇంట్లోనే ఉండి, ముఖంపై అక్కడక్కడ కనిపించే వెంట్రుకలని తొలగించుకోవచ్చు. దీనికోసం ఫేస్ మాస్క్ బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఆ ఫేస్ మాస్క్ తయారీ తెలుసుకుందాం.

తేనె, చక్కెర

ఒక చెంచా తేనెలో రెండు చెంచాల చక్కెర మరియు నీరు కలపండి. చక్కెర కరిగిపోయే వరకు వేడి చేయండి. చక్కెర కరిగిన తర్వాత మీ ముఖంపై వెంట్రుకలు ఉన్న స్థానంలో వర్తించాలి.

మొక్కజొన్న పిండి, గుడ్డు

గుడ్డుని పగలగొట్టి పచ్చసొనని వేరు చేయండి. ఒక పాత్రలో గుడ్డులోని తెల్లటి భాగాన్ని వేసి అందులో మొక్కజొన్న పిండి కలపండి. ఇపుడు దానికి కాసింత చక్కెర కలిపి చక్కెర కరిగేవరకు వేడి చేయాలి. ఈ పేస్టుని చర్మంపై పూయాలి. అది పూర్తిగా ఎండిపోయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

పాలు, జెలటిన్

ఒక పాత్రలో ఒక చెంచా జెలటిన్ పౌడర్ తీసుకుని, దానికి మూడు చెంచాల పాలు కలపండి. ఆ తర్వాత దానికి కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేయండి. దీనివల్ల మరింత ప్రభావం ఉంటుంది. ఈ మూడింటి మిశ్రమాన్ని గోరువెచ్చగా మరిగే వరకు వేడి చేయాలి. ఆ తర్వాత చర్మానికి అప్లై చేసుకోవాలి. కొద్దిసేపయ్యాక సబ్బునీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

ఈ పద్దతులు పాటిస్తే ముఖంపై ఉన్న అవాంచిత రోమాలు తొలగిపోతాయి.