బిజినెస్ ఐడియా: ఉద్యోగం కోసం చూసీ చూసి విసిగిపోయారా..? ఇలా చేస్తే నెలకి యాభై వేలు వస్తాయి..!

మీరు ఏదైనా వ్యాపారాన్ని చేయాలనుకుంటున్నారా..? ఆ వ్యాపారం ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే తప్పకుండా మీరు ఈ బిజినెస్ ఐడియా గురించి చూడాలి. నిజానికి ప్రతి ఒక్కరికీ ఉద్యోగం చేయాలని ఉన్నా సరే ఉద్యోగం దొరకక పోవచ్చు. చాలా మంది ఉద్యోగం కోసం వెతికి వెతికి వెతికి పోతూ ఉంటారు. మీది కూడా అదే పరిస్థితి అయితే కచ్చితంగా ఈ బిజినెస్ ఐడియా గురించి చూడాలి.

ఈ బిజినెస్ ఐడియాని కనుక మీరు ఫాలో అయ్యారంటే నెలకు 50 వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. పైగా దీనికోసం మీరు పెద్దగా కష్ట పడక్కర్లేదు కూడా పెట్టుబడి కూడా ఎక్కువ అక్కర్లేదు. 25 వేల రూపాయలు మీరు పెట్టుబడి కింద పెడితే సరిపోతుంది దీంతో నెలనెలా 50000 సంపాదించొచ్చు. క్రమంగా సంపాదన కూడా పెరుగుతుంది. అదే కారు వాషింగ్. కారు వాషింగ్ ని మొదలుపెట్టి మీరు చక్కగా సంపాదించుకోవచ్చు.

ఈ వ్యాపారం కోసం ప్రొఫెషనల్ మిషన్స్ కావాలి. వీటి ధర 12 వేల రూపాయలు వరకు ఉంటుంది. టు హార్స్ పవర్ ఉన్న మిషన్స్, పైపులు, నాజిల్స్ ఇలా కొన్ని పరికరాల అవసరమవుతాయి వీటి కోసం మీరు పది వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటి 30 లీటర్ల వాక్యూమ్ క్లీనర్ కూడా కావాలి. ఇలా మీరు ఒక షెడ్ ని మొదలు పెట్టి కార్లను క్లీన్ చేస్తూ ఉండాలి.

కార్ వాషింగ్ కోసం 150 నుండి 450 రూపాయల వరకు వసూలు చేస్తూ ఉంటారు. ధర అనేది మీ ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. ఇలా మీ ప్రాంతమని బట్టీ మీరు రేటుని డిసైడ్ అవ్వచ్చు. కార్ల తో పాటుగా బైక్ వాషింగ్ కూడా మీరు మొదలు పెట్టొచ్చు. ఏదిఏమైనప్పటికీ ఖర్చులన్నీ పోను యాభై వేల రూపాయల వరకు సంపాదించవచ్చు.