మహిళలకు బెస్ట్‌ బిజనెస్‌ ఐడియా.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు..!!

-

ఈరోజుల్లో.. ఉద్యోగాలకు గ్యారెంటీ లేదు. ఎప్పుడు జాబ్‌ పోతుందో చెప్పలేని పరిస్థితి.. ఇలాంటి టైమ్‌లో.. చిన్నదో పెద్దదో ఏదో ఒక వ్యాపారం చేయడం మంచిదని చాలా మంది అనుకుంటున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటుంటే.. ఈ కార్డు మీ కోసమే.. ముఖ్యంగా ఇది మహిళలకు చాలా మంచి వ్యాపారం. అదే పేప‌ర్ ప్లేట్స్ తయారీ బిజినెస్ ఒక‌టి. ఈరోజుల్లో ఏ చిన్న ఫంక్షన్‌ అయినా.. భోజనాలు ఉంటాయి..అందుకు ప్లేట్స్‌ కచ్చితంగా కావాలి.త‌క్కువ ఖ‌ర్చుతోనే ఎక్కువ లాభాల‌ను తెచ్చి పెట్టే వ్యాపారాల‌లో ఇది ఒక‌టి.

Fully Automatic paper plate making machine Mob. +91 9841403512 - YouTube

గృహిణిలు, నిరుద్యోగులు కూడా ఈ వ్యాపారాన్ని ఎంతో సులువుగా చేయ‌వ‌చ్చు. ఈ వ్యాపారం చేయడానికి మొదట్లో.. కాస్త శ్ర‌మించాల్సి ఉంటుంది. ఇక పెట్టుబ‌డి కూడా పెద్ద‌గా ఏమీ ఉండ‌దు. మ‌నం పెట్టే పెట్టుబ‌డికి అనుగుణంగా ఈ వ్యాపారంలో లాభాలు వ‌స్తాయి. ఈ వ్యాపారం చేసేందుకు కావ‌ల్సిన పెట్టుబ‌డి, ఇత‌ర ఖ‌ర్చులు, లాభాల విషయానికి వస్తే. పేప‌ర్ ప్లేట్స్‌ను త‌యారు చేసే మెషిన్‌ను ముందుగా తీసుకోవాలి. ఈ మెషిన్‌ల‌లో మూడు ర‌కాలు ఉంటాయి. మొద‌టిది మ్యానువ‌ల్ మేకింగ్ మిషిన్‌. దీని ధ‌ర రూ.15 వేల నుండి రూ.20 వేల వ‌ర‌కు ఉంటుంది. రెండ‌వ‌ది సెమీ ఆటోమేటిక్ మెషిన్‌. దీని ధ‌ర రూ.40 వేల వ‌ర‌కు ఉంటుంది. మూడ‌వ‌ది ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్‌. దీని ధ‌ర రూ. 1 ల‌క్ష వ‌ర‌కు ఉంటుంది. ఈ బిజినెస్‌ను ప్రారంభించే వారికి సెమీ ఆటోమెటిక్ మెషిన్ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఈ మెషిన్ వ‌ల్ల ముడి స‌రుకుల‌తో మ‌నం ఎంతో సులువుగా పేప‌ర్ ప్లేట్స్‌ను చేసుకోవ‌చ్చు.

Fully Automated Buffet Paper Plate Making Machine / Small Scale IndustrY - YouTube

ఒక రోజుకి మ‌నం 8 గంట‌లు ప‌ని చేయ‌డం వల్ల సుమారుగా 8 వేల పేప‌ర్ ప్లేట్స్‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఒక్కో ప్లేటుపై అన్ని ఖ‌ర్చులు పోయిన త‌రువాత‌ 15 పైస‌లు మిగులుతాయి. రోజుకి 8 వేల ప్లేట్ల‌కు గాను అన్ని ఖ‌ర్చులు పోగా రూ.1200 మిగులుతాయి. ఎక్కువ గంట‌లు ప‌ని చేయ‌డం వ‌ల్ల రూ.1200 కంటే ఇంకా ఎక్కువ డబ్బులు మిగులుతాయి. రోజుకి రూ.1200 చొప్పున నెల‌కు రూ.36 వేలను మ‌నం సంపాదించ‌వ‌చ్చు.

ఈ మెషిన్‌తో మ‌నం 4 లేదా 5 ర‌కాల ప్లేట్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ మిషిన్‌తో మ‌నం ఇంట్లో కూడా ప్లేట్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. దీనికి అనుభవం ఉండాల్సిన పనిలేదు.. ఈ మెషిన్ స‌హాయంతో ఎవ‌రైనా కూడా చాలా సులువుగా ప్లేట్ల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. ప్లేట్ల‌ను త‌యారు చేసేట‌ప్పుడు త‌ప్పని స‌రిగా త‌గిన జాగ్ర‌త్త‌లను తీసుకోవాలి. ఇందులో తెలిపిన మెషిన్ ధ‌ర‌లు, ఖ‌ర్చులు, మిగులు సంపాద‌న కేవ‌లం అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే. మ‌న‌కు వ‌చ్చే ఆర్డ‌ర్స్‌, మార్కెటింగ్, మ‌నం చేసే ప‌ని గంట‌ల‌పై మ‌న మిగులు సంపాద‌న ఆధార‌ప‌డి ఉంటుంది.

అలాగే ఈ మెషిన్‌లు, పేప‌ర్ ప్లేట్ల‌ను త‌యారు చేసేందుకు ఉప‌యోగ‌ప‌డే రా మెటీరియ‌ల్ ధ‌ర‌లు మార్కెట్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు మారుతుంటాయి. మీకు ఇంట్రస్ట్ ఉంటే.. ఈ వ్యాపారంపై.. పూర్తిగా అవగాహన తెచ్చుకోని స్టెప్‌ తీసుకోవచ్చు.!

Read more RELATED
Recommended to you

Latest news