బిజినెస్ ఐడియా: ఆవు పేడతో నెలకు లక్షల్లో లాభాలు..!

-

మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారా..? ఆ వ్యాపారం తో మంచిగా డబ్బులని సంపాదించాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియాని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా లక్షల్లో లాభాలను పొందవచ్చు. పైగా ఈ వ్యాపారం చేయడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. మరి ఇక ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

 

మనదేశంలో చాలా మంది పేడ తో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ఆవు మూత్రం, ఆవుపేడ వంటి వాటితో బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. మార్కెట్లో ఆవు పేడతో తయారు చేసిన పిడకలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. యజ్ఞాలు, హోమాలు లో పిడకలని వాడతారు.

అలానే ఆవు పిడకలను పొగ వేస్తే క్రిమికీటకాలు రావు అని అంటారు. అందుకని పిడకలను చాలా మంది వాడతారు. ఈమధ్య అమెజాన్, ఫ్లిప్ కార్డ్ వంటి వాటిలో కూడా ఆవు పిడకలను అమ్ముతున్నారు. నాణ్యమైన పిడకల ధర 150 నుంచి 300 వరకు ఉంటుంది. చిన్న చిన్న ప్యాకెట్లుగా కూడా చేసి అమ్మొచ్చు.

చత్తీస్గడ్ వంటి రాష్ట్రాలలో మహిళలు గ్రూపులుగా ఏర్పడి పిడకలు తయారు చేసి అమ్ముతున్నారు. అలానే దీపాలు, కుండీలు, విగ్రహాలు లాంటివి కూడా తయారు చేస్తున్నారు. పైగా మహిళల సాధికారత కోసం గోధన్ యోజన వంటి పథకాలు కూడా తీసుకువచ్చారు. ఇలా మీరు పిడకల ద్వారా చక్కగా డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ వ్యాపారం తో నెలకు లక్ష రూపాయల వరకు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news