బిజినెస్ ఐడియా: యోగాతో అదిరిపోయే ఆదాయం…!

-

మీరు డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఒక మంచి ఐడియా. ఇలా ఈజీగా మీరు డబ్బులు సంపాదించచ్చు. ఇక ఈ బిజినెస్ ఐడియా గురించి చూస్తే.. యోగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

బిజినెస్ ఐడియా

పైగా ఈ మధ్య కాలంలో చాలా మంది యోగ పై మక్కువ చూపిస్తున్నారు. దీనితో మీరు యోగ ద్వారా క్యాష్ చేసుకోవచ్చు. దీని కోసం మీ దగ్గర శిక్షణ, సర్టిఫికేట్ మొదట తీసుకోవాలి. దీని కోసం మీకు ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరాల కఠినమైన శిక్షణ సర్టిఫికేట్ అవసరం.

దేశంలోని కొన్ని పెద్ద సంస్థలు దీనికి సంబంధించిన శిక్షణను అందిస్తున్నాయి. ఇలా మీరు వృత్తి, ధృవీకరణ పత్రాన్ని పొందడం ద్వారా కెరీర్ అవకాశాలను పొందవచ్చు.

యోగ ఇన్స్ట్రక్టర్ గా మీరు పని చెయ్యచ్చు. చాల ఫిట్‌నెస్ కేంద్రాలు ఇప్పుడు యోగ ఇన్స్ట్రక్టర్స్ కావాలని అంటున్నారు. లేదా మీరే సొంతంగా సెంటర్ ని ఏర్పాటు చేసుకోవచ్చు.

యోగా శిక్షకుడిగా, మీరు ఒక శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా నెలకు 20-30 వేల రూపాయలు సంపాదించ వచ్చు. ఇలా మీరు మంచిగా డబ్బులని సంపాదించచ్చు. అదే సమయంలో, శిక్షకుడు ఒకరి ఇంట్లో బోధిస్తే, అక్కడ ఫీజు వసూలు చేయవచ్చు. ఇలా నెలకు 1-2 లక్షల వరకు సంపాదిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news