బిజినెస్ ఐడియా: 35 వేలతో అదిరిపోయే బిజినెస్..నెలకు లక్ష ఆదాయం..

-

ఈరోజుల్లో ఉద్యోగం కన్నా కూడా ఎక్కువ మంది బిజినెస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే ఎటువంటి వ్యాపారం చేయాలో తెలియక చాలా నష్ట పోతున్నారు..తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలను పొందాలని భావించే వారికి బెస్ట్ ఆఫ్షన్ అందుబాటులో ఉంది.ఈ రోజుల్లో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించుకోవాలనుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఉద్యోగం కన్నా వ్యాపారం మేలు అని అనేక మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు కూడా సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించుకోవాలని భావిస్తే.. మీకోసం ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా. అదే తేనెటీగల పెంపకం.

 

ఈ వ్యాపారం ద్వారా చాలా డబ్బు సంపాధించుకోవచ్చు. ఇంకా ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, కేంద్ర ప్రభుత్వం సైతం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనేక రాష్ట్రాలు సబ్సిడీని కూడా ఇస్తున్నాయి.ఈ బిజినెస్ ను ఎక్కడైనా ప్రారంభించ వచ్చు..కొద్దిగా ఆలోచన ఉంటే చాలు చాలా మంచి లాభాలను పొందవచ్చు.రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ పంట ఉత్పాదకతను మెరుగుపరచడానికి తేనెటీగల పెంపకం అభివృద్ధి పేరుతో ఒక కేంద్ర పథకాన్ని ప్రారంభించింది . ఈ పథకం యొక్క లక్ష్యం తేనెటీగల పెంపకం రంగాన్ని అభివృద్ధి చేయడం, ఉత్పాదకతను పెంచడం, శిక్షణ మరియు అవగాహన కల్పించడం. నేషనల్ బీ బోర్డ్ నాబార్డ్‌తో కలిసి భారతదేశంలో తేనెటీగల పెంపకానికి ఆర్థిక సహాయం అందించే పథకాలను కూడా ప్రారంభించింది.

ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి ప్రభుత్వం 85 శాతం సబ్సిడీని కూడా ఇస్తుంది.10 పెట్టెలతో కూడా తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీకు కావాలంటే, మీరు 10 పెట్టెలతో కూడా తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఒక పెట్టెలో 40 కిలోల తేనె లభిస్తే మొత్తం తేనె 400 కిలోలు అవుతుంది. 400 కిలోలను కిలో రూ.350 చొప్పున విక్రయిస్తే రూ.1.40 లక్షల ఆదాయం వస్తుంది. ఒక్కో పెట్టె ఖర్చు రూ.3500 వరకు ఉంటుంది. అంటే మొత్తం ఖర్చు రూ.35,000 కాగా నికర లాభం రూ.1,05,000 గా ఉంటుంది..ఈ ఐడియా చాలా బాగుంది కదూ.. అసలు రిస్క్ లేకుండా లాభాన్ని పొందవచ్చు.. ఆలస్యం ఎందుకు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి.

Read more RELATED
Recommended to you

Latest news