బిజినెస్ ఐడియా: టెన్షన్ లేని బిజినెస్..సొంత ఊర్లో ఉంటూనే నెలకు లక్ష ఆదాయం..

బిజినెస్ చెయ్యాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది..అయితే కొన్ని బిజినెస్ లు రిస్క్ తో కూడుకున్నవి ఉన్నాయి.. మరికొన్ని బిజినెస్ లు మాత్రం రిస్క్ ఉన్నా మంచి ఆదాయం వస్తుంది.మీరు కూడా సొంతంగా వ్యాపారం చేయాలని భావిస్తుంటే.. అందుకు పౌల్ట్రీ ఫామ్ బిజినెస్ చక్కటి అవకాశం. దీనికి రోజుకు 4 గంటలు కేటాయిస్తే చాలు. ఆ తర్వాత ఇతర పనులు కూడా చేసుకోవచ్చు. పెట్టుబడి కాస్త ఎక్కువగా ఉన్నా.. ఇబ్బందేం లేదు. బ్యాంకులు రుణాలు ఇస్తాయి.

సాధారణంగా 10 వేల కోళ్ల సామర్థ్యం గల షెడ్డు నిర్మాణాని కి దాదాపు రూ.10-15 లక్షల వరకు ఖర్చవుతుంది. షెడ్డు గోడలు, ఐరన్ మెష్, ఇతర సామాగ్రి మొత్తం ఇందులోనే వస్తాయి. ఊరికి దూరంగా పొలాల్లో నిర్మించుకుంటే ఉపయోగం ఉండదు. రోడ్డు సౌకర్యం ఉన్నచోటే పౌల్ట్రీ షెడ్‌ను నిర్మించాల్సి ఉంటుంది. షెడ్డు నిర్మాణం పూర్తైన తర్వాత మీరు ఏదేని కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. వెన్‌కాబ్, సుగుణ, స్నేహ వంటి పౌల్ట్రీ కంపెనీలతో అగ్రీమెంట్ చేసుకోవచ్చు. సదరు కంపెనీ వారే మీకు బ్రాయిలర్ కోడి పిల్లలు ఇస్తారు.

అంతేకాదు..రవాణా ఖర్చులు కూడా వారివే. ఆ తర్వాత వాటికి అవసరమైన దాణా, రోగాల బారినపడకుండా ఇంజెక్షన్స్ కూడా వారే సప్లై చేస్తారు. మీరు కేవలం వాటిని పెంచి.. ఇవ్వాల్సి ఉంటుంది. అలా పెంచినందుకు.. కమిషన్ ఇస్తారు. కోళ్లు ఒక సైజుకు వచ్చిన తర్వాత.. కంపెనీ వారే వాహనాన్ని మీ షెడ్డు వద్దకు పంపించి.. కోళ్లను తీసుకెళ్తారు..మీ షెడ్‌లో ఉన్న మొత్తం కోళ్ల బరువు 20వేల కేజీలు. కంపెనీ వారు ఒక్కొ కేజీకి రూ.3 చొప్పున కమిషన్ చెల్లిస్తే.. మీకు రూ.60వేలు వస్తాయి. ఖర్చులకు రూ.10 వేలు పోయినా.. రూ.50వేలు మిగులుతాయి. కొన్ని కంపెనీలు రూ.4 కూడా ఇస్తాయి. అప్పుడు బ్యాచ్‌కు రూ.80 వేల వరకు వస్తాయి. ఈ లెక్కన నెలకు రూ.50వేలు మిగులుతాయి. మీ వ్యాపారాన్ని మరింత విస్తరించి.. ఇంకో షెడ్డు ఏర్పాటు చేసుకుంటే… లక్ష వరకు సంపాదించవచ్చు.
మీరు పౌల్ట్రీ కంపెనీలతో కాంట్రాక్ట్ ఒప్పందం కాకుండా… సొంతంగా కూడా బిజినెస్ చేయవచ్చు. అంటే సొంతంగా కోడిపిల్లలు కొని.. వాటిన పెంచి. .మీరే అమ్ముకోవాల్సి ఉంటుంది. ఐతే దీనికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కారణంతో కోడిపిల్లలు మరణిస్తే.. భారీగా నష్టం వస్తుంది. ఒకవేళ మార్కెటింగ్ చేసుకోలేకపోయినా ఇబ్బందులు తప్పవు. ఐతే అన్ని అనుకున్నట్లుగా జరిగితే లాభాలు అధికంగా ఉంటాయి.. మన దేశంలో చికెన్ కు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. మీకు ఈ ఆలోచన వుంటే మీరు కూడా ట్రై చెయ్యండి..