బిజినెస్ ఐడియా: ఏడాది పొడవునా డిమాండ్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం..

-

ప్రస్తుతం చాలా మంది తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలను పొందాలని అనుకుంటారు..జీతంతో పోలిస్తే తక్కువ వచ్చిన పర్లేదు నెమ్మదిగా వెల్దామని అందరూ కొత్త బిజినెస్ ల కోసం వెతుకుతున్నారు..మీరు కూడా అదే ఆలోచనలో ఉన్నారా? ఐతే మీలాంటి వారి కోసమే మరో బిజినెస్ ఐడియాను తీసుకొచ్చాం. మర్మరాలను మన దేశంలోని ఎక్కువగా వినియోగిస్తారు. కొన్నిచోట్ల బొరుగులు, బొంగులు కూడా అంటారు. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల వరకు అంతటా మర్మాలను తింటారు. ఉగ్గాని, భేల్ పురి వంటి వంటకాలను చేసుకొని..ఇష్టంగా లాగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో దేవుడికి నైవేద్యంగా కూడా పెడతారు. అందుకే దీనికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.

అక్కడా, ఇక్కడా అని లేకుండా రోడ్డు మీద, పెద్ద మాల్స్ లో కనిపిస్తాయి.రిటైల్ స్టోర్లలో ప్యాకేజింగ్‌లో లభిస్తుంది. ఈకామర్స్ సైట్లలో కూడా విక్రయిస్తున్నారు. మీరు కూడా ఈ వ్యాపారం ప్రారంభిస్తే.. మంచి లాభాలు వస్తాయి. తక్కువ పెట్టుబడితోనే మర్మరాల తయారీని ప్రారంభించి..రిటైల్ స్టోర్లలో ప్యాకేజింగ్‌లో లభిస్తుంది. ఈకామర్స్ సైట్లలో కూడా విక్రయిస్తున్నారు. మీరు కూడా ఈ వ్యాపారం ప్రారంభిస్తే.. మంచి లాభాలు వస్తాయి. తక్కువ పెట్టుబడితోనే మర్మరాల తయారీని ప్రారంభించి, మంచి లాభాలను పొందవచ్చు..

ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ గ్రామ పరిశ్రమల ఉపాధి పథకం కింద ముర్మురా తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఒక ప్రాజెక్ట్‌ను సిద్ధం చేసింది. ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం ముర్మురా తయారీ యూనిట్ ఏర్పాటుకు మొత్తం రూ.3.55 లక్షలు ఖర్చు అవుతుంది. వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ వద్ద నిధులు లేకుంటే, మీరు PM ముద్ర లోన్ స్కీమ్ ద్వారా లోన్ తీసుకోవచ్చు. ప్రాజెక్ట్ నివేదిక ఆధారంగా, మీరు బ్యాంకు నుండి రుణం కోసం దరఖాస్తు కూడా చేసుకోవచ్చు…

యూనిట్ నుంచి ఏడాదికి 200 క్వింటాళ్లు ఉత్పత్తి చేశారనుకుందాం. కిలోకు రూ.30 లెక్కేసినా..మొత్తం రూ.6,00,000 వస్తాయి. ఇందులో ముడి సరుకు, ఇతర ఖర్చులకు రూ.3 లక్షలు పోయినా.. మరో రూ. 3 లక్షలు మిగులుతాయి…మీరు మంచిగా మార్కెట్ చేసుకుంటే ఇంకా లాభాన్ని పొందవచ్చు.. ఈ బిజినెస్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news