బిజినెస్ ఐడియా: ఎల్ఈడీ బల్బుల తయారీ యూనిట్ తో నెలకు రూ.1.5 లక్షలు..!

-

ఎక్కువ మంది ఈ మధ్య వ్యాపారాలను చెయ్యడానికి ఇష్టపడుతున్నారు. ఉద్యోగాలను కూడా వదిలేసుకుని నచ్చిన వ్యాపారాన్ని మొదలు పెడుతున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారా..? దాని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా.

ఈ బిజినెస్ ఐడియాని కనుక మీరు ఫాలో అయ్యారంటే మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది. అదే ఎల్ఈడీ బల్బులు తయారీ వ్యాపారం. ఎల్ఈడీ బల్బులను తయారు చేసి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎల్ఈడీ బల్బుల తయారీ ఫ్యాక్టరీ యూనిట్ ని మొదలు పెట్టాలంటే ప్రభుత్వం శిక్షణ కూడా ఇస్తోంది.

చాలా కాలం పాటు ఎల్ఈడీ బల్బులు మన్నుతాయి. మామూలుగా గాజు బల్బులు విరిగిపోతాయి. ఎల్ఈడీ బల్బుల మాత్రం 50 వేల గంటలు వస్తాయి. ఒక్కోసారి అంతకంటే ఎక్కువ కూడా వస్తాయి. పైగా వీటిని రీసైకిల్ కూడా చేయొచ్చు. డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఎల్ఈడీ బల్బుల వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు. స్వయం ఉపాధి పథకం కింద బల్బులు తయారీకి శిక్షణ ఇస్తారు బల్బుల తయారీ కాంట్రాక్స్ ని కూడా ఇస్తారు.

దీనిని మొదలుపెట్టడానికి 50 వేల రూపాయలు ఉంటే సరిపోతుంది. కావలసిన మెటీరియల్ ని కొనుగోలు చేసి మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు. మార్కెట్లో 100 రూపాయలు కి సులభంగా ఒక బల్బ్ ని అమ్మచ్చు. మామూలుగా ఒక బల్బ్ చేయడానికి 50 రూపాయలు అయితే మీకు రెట్టింపు వస్తాయి. రోజుకి మీరు 100 బల్బులు తయారు చేస్తే 5000 ఖర్చు అవుతాయి. పది వేలు వస్తాయి. ఎలా చూస్తున్న నెలకి లక్షన్నర సులభంగా సంపాదించడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news