బిజినెస్ ఐడియా: తక్కువ పెట్టుబడితో నెలకు రూ.70 వేలు పక్కా..ఎలాగంటే..?

-

బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసం అదిరిపోయే బిజినెస్ ఉంది.కేంద్ర ప్రభుత్వం పలు ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించింది. ప్రజల్లో కూడా ప్లాస్టిక్ గురించి అవగాహన పెరిగింది. పర్యావరణంపై ప్రజల్లో ఉన్న అవగాహన వల్ల పేపర్ కప్పులకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మీరు పేపర్ కప్పుల తయారీ యూనిట్ ప్రారంభిస్తే మంచి లాభాలు వస్తాయి.

పేపర్‌కప్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ముద్ర పథకం కింద కేంద్ర ప్రభుత్వం రుణాలు కూడా ఇస్తోంది. తక్కువ డబ్బు పెట్టుబడితోనే పేపర్ కప్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్కువ పెట్టుబడి పెట్టాలనుకుంటే.. మంచి యూనిట్ ను పెట్టవచ్చు.. కాగితం కప్పుల తయారీకి ముడి పదార్థాలు, యంత్రాలు మార్కెట్‌లో సులభంగా అందుబాటులో ఉన్నాయి. పేపర్ కప్పులను తయారు చేసేందుకు పేపర్ రీల్, బాటమ్ రీల్, ఇతర యంత్రాలు అవసరం. మార్కెట్‌లో అనేక రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో సంప్రదించి ఢిల్లీ, జైపూర్ వంటి పెద్ద నగరం నుంచి కూడా పేపర్ రీల్, బాటమ్ రీల్‌లను సులభంగా కొనుగోలు చేయవచ్చు.

పేపర్ రీల్ ధర కిలో రూ.90 నుంచి మొదలవుతుంది. బాటమ్ రీల్ ధర కూడా కిలోకి రూ.80 వరకు ఉంటుంది. పేపర్ కప్ ఫ్రేమింగ్ మెషిన్ 5 లక్షల రూపాయలలో లభిస్తుంది..పది లక్షల రూపాయల పెట్టుబడితో అన్ని రకాల సైజుల్లో కప్పులు, గ్లాసులను ఉత్పత్తి చేయవచ్చు. పేపర్ కప్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రుణసాయం చేస్తుంది. ముద్ర యోజన పథకం కింద మీరు ఈ రుణం తీసుకోవచ్చు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 25% మీ స్వంతంగా పెట్టుబడి పెట్టాలి. ముద్ర పథకం కింద ప్రభుత్వం 75 శాతం రుణం ఇస్తుంది.సాధారణంగా పేపర్ కప్పుల తయారీ యంత్రంతో ప్రతి నెలా 15 లక్షలకు పైగా కప్పులను ఉత్పత్తి చేయవచ్చు. ఒక్క కప్పును 30 పైసలకు విక్రయించినా… మీకు దాదాపు రూ.4,70,000 ఆదాయం వస్తుంది..ఇందులో తయారికి, ముడిసరుకు అన్నీ ఖర్చులు పోగా నికర ఆదాయం 70 వేలకు పైగా మిగులుతుంది.. మీరు కూడా ఆసక్తి ఉంటే మొదలు పెట్టండి..

Read more RELATED
Recommended to you

Latest news