నైట్ మొత్తం ఫోన్ కు చార్జింగ్ పెడితే ఏమౌతుందో తెలుసా?

-

కొన్ని కంపెనీల ఫోన్ లకు చార్జింగ్ ఎక్కువ సేపు ఉండదు.. ఇంకా చెప్పాలంటే స్లోగా చార్జింగ్ ఎక్కుతుంది..ఇక మొబైల్ వాడకం కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాను అధికంగా వాడేవారికి నిత్యం చార్జింగ్ ఉండాలి..రాత్రి నిద్ర పోయేటప్పుడు మాత్రం ఫోన్ కు గ్యాప్ ఇస్తారు. ఉదయం లేవగానే ఫోన్ కళ్ళముందు కనిపించాలి. అలాంటి వాళ్ళు డే అంతా వినియోగించుకునేందుకు వీలుగా రాత్రంగా ఫోన్ ఛార్జింగ్ పెడుతుంటారు. అయితే ఈ ప్రాక్టీస్ మంచిదా కాదా..? అనే డౌట్ చాలామందికి ఉంటుంది.

 

రాత్రంతా ఫోన్​ ఛార్జింగ్​ పెట్టొద్దని.. అలా చేయడం డేంజర్ అని కొందరు చెబుతుంటారు. దీనిపై మేము కొందరు నిపుణులు నుంచి సమాచారం సేకరించాం.ఫోన్​ను రాత్రంతా ఛార్జింగ్​లో ఉంచితే ఎలాంటి ప్రమాదం లేదని వారు చెబుతున్నారు. 100 పర్సెంట్ ఛార్జింగ్ మాత్రమే అవుతుందని… ఆ తర్వాత ఫోన్ ఛార్జ్‌ను తీసుకోదని వెల్లడించారు..బ్యాటరీ, ఛార్జర్​పైనా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఓవర్​ ఛార్జ్​ అయ్యి మంటలు చెలరేగే అవకాశం లేదని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఎక్కువ వాడకంలో ఉన్నవి లిథియం-అయాన్​ బ్యాటరీలు. ఇవి ఫోన్​ ఫుల్​ ఛార్జ్​ అవ్వగానే కరెంట్ తీసుకోకుండా రిస్ట్రెక్ట్ చేసే పరికరాలను ఇన్​బిల్ట్​గా కలిగి ఉంటున్నాయి. అయితే మీరు వినియోగించే బ్యాటరీ, ఫోన్ మోడల్స్​ అన్ని ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలవా? అన్నది చెక్ చేసుకోవాల్సిన అంశం..ఇకపోతే మనం వాడే ఫోన్ చార్జర్ లో, లేదా ఇంట్లో ఏదైనా పవర్ ప్రాబ్లెమ్ ఉన్నప్పుడు మాత్రమే అవి పెలతాయి.. ఇది గుర్తుంచుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news