బిజినెస్ ఐడియా: ఈ ఛాయ్ కప్పులతో అదిరే లాభాలు పొందొచ్చు..!

-

మీరు ఏదైనా వ్యాపారం ని మొదలు పెట్టాలనుకుంటున్నారు..? ఏ వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా ని కనుక ఫాలో అయితే మంచిగా లాభాలు వస్తాయి. ప్లాస్టిక్ పేపర్ కప్పులు కంటే కూడా ఇవి చాలా మంచివి. పైగా ఇవి పర్యావరణానికి హాని చేయవు. అవే కుల్హద్ కప్స్. వీటిని కనుక మీరు తయారు చేశారు అంటే మంచిగా లాభాలు వస్తాయి. పైగా ఐదు వేల రూపాయల పెట్టుబడితో మీరు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు.

ఈ వ్యాపారం బెస్ట్ అండ్ ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. పైగా ప్రభుత్వం కూడా సహాయం అందిస్తుంది. ఇక ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాల్లోకి వెళితే… ఉత్తర భారత దేశంలో పాటు దక్షిణ భారతదేశంలో కూడా ఈ వ్యాపారం బాగా ఫేమస్ అవుతోంది. చాలా టీ కొట్టులలో ఈ కప్పులు తోనే టీ ని ఇస్తున్నారు. కుల్హద్ చాయ్ కి డిమాండ్ పెద్దగా ఉంది. దీనిని మీరు క్యాష్ చేసుకోవచ్చు.

ప్లాస్టిక్ కప్పులని ఒకసారి వాడిన తర్వాత పక్కన పెట్టేయాలి. దీని వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. కానీ కుల్హద్ కప్పులని మాత్రం ఎటువంటి హాని చేయవు తయారీ కోసం ఎలక్ట్రికల్ వీల్ ని ప్రభుత్వం అందిస్తుంది.

ఒకవేళ కనుక భవిష్యత్తులో పేపర్ కప్పులని తొలగిస్తే అప్పుడు వీటి రేట్లు కూడా బాగా పెరుగుతాయి. దీంతో వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఈ టీ రూ. 15 నుండి 20 వరకు పలుకుతుంది. మీరు కనుక వెయ్యి టీ కప్పులని అమ్మితే 30 వేల నుంచి 50 వేల వరకు సంపాదించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news