కురుక్షేత్రంలో అభిమన్యుడిని బంధించి చంపారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

-

కురుక్షేత్రంలో అభిమన్యుడిని బంధించి చంపారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా పార్లమెంట్ లో మాట్లాడారు రాహుల్ గాంధీ.  పద్మవ్యూహం కమలం పార్టీ రూపంలో దేశంలో లో ఉంది. అప్పుడు పద్మవ్యూహాన్ని ఆరుగురు కంట్రోల్ చేశారు. ఇప్పుడు మోడీ, అమిత్ షా,  మోహన్ భగవత్ కంట్రోల్ చేస్తున్నారు.  ఈ ప్రభుత్వం వల్ల ఆదానీ, అంబానీలకే ప్రయోజనం అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.   కాళ్లు విరగ్గొట్టి మీద బ్లాంకెట్ వేసినట్టుంది. రాహుల్ గాంధీ ప్రసంగానికి బీజేపీ సభ్యులు పార్లమెంట్ లో అడ్డు తగులుతున్నారు. రైతులకు ఇప్పటి వరకు స్పష్టమైన హామీ లభించలేదన్నారు రాహుల్ గాంధీ బడ్జెట్ లో మధ్య తరగతి ప్రజలను విస్మరించారు.

దేశవ్యాప్తంగా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి.అగ్ని  వీరులను కేంద్రం మోసం చేస్తుందన్నారు. అగ్నీవీరులకు కేంద్రం బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించలేదు. రైతులు, కార్మికులు భయపడుతున్నారు. నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. రైతులకు మా హయాంలో నిబంధనలు సడలించి రుణమాణీ చేశాం. కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మధ్య తరగతి ప్రజలు ఇండియా కూటమికి మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news