జగన్ కు న్యాయం చేయండి.. ప్రభుత్వానికి నాగబాబు షాకింగ్ రిక్వెస్ట్..!

-

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఎదుట జనసేన నేత నాగబాబు ఆసక్తికర డిమాండ్ పెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఓ పోస్ట్ చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై దాడి కేసును త్వరగా విచారించి న్యాయం చేయాలని కోరారు. దాడి జరిగి ఐదేళ్లు గడుస్తున్నప్పటికీ.. ఆయనకు ఇంత వరకు న్యాయం జరగలేదన్నారు. దాడి చేసిన నిందితుడికి సరైన శిక్ష విధించాలని కోరారు.

వైఎస్ జగన్ పై 2019 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్ ఫోర్ట్ లో జరిగిన దాడి ఘటనను ప్రస్తావించారు. 2019కి ముందు ఎమ్మెల్యేగా ఉన్న జగన్.. తరువాత ఏపీకి సీఎంగా మారి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అతనికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి. ఎందుకు అంటే.. 2019లో శ్రీను అనే వ్యక్తి ఆయన మీద కోడికత్తితో దాడి చేశాడు. ఐదేళ్లు అయినా కూడా ఆ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. అప్పుడు జగన్ బిజీగా ఉండటం వల్ల ఆయనకు కుదరలేదు. కూటమి ప్రభుత్వం అయినా న్యాయం చేయాల్సిన అవసరం అత్యవసరం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news