చిరంజీవిని నటుడిగా అగ్రస్థానంలో నిలిపిన ‘ఖైదీ’

-

చిరంజీవిని నటుడిగా అగ్రస్థానంలో నిలిపిన మూవీ ఖైదీ అయితే.. అయనకు అమితమైన ఫ్యాన్స్ ఏర్పడేలా చేసింది.. గ్యాంగ్ లీడర్ మూవీ.

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు చెబితే చాలు మెగా ఫ్యాన్స్‌కు పూనకం వస్తుంది. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్‌కు పండగే. థియేటర్లో చిరంజీవి సినిమా పడింది మొదలు ఆ మూవీ 100 రోజులు ఆడే వరకు ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. అసలు తెలుగు సినీ ఇండస్ట్రీలోనే చిరంజీవికి ఉన్నంత మంది ఫ్యాన్స్ ఏ నటుడికీ లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయనకు అంతటి అభిమానగణాన్ని సంపాదించి పెట్టిన సినిమాల్లో మొదటిది.. ఖైదీ.. ఆ సినిమా ఆయన్ను నటుడిగా అగ్రస్థానంలో నిలిపింది. అనేక మంది చిరంజీవి అభిమానులు అయ్యేలా చేసింది..

చిరంజీవి ఖైదీ మూవీ 1983లో విడుదల కాగా.. అప్పట్లో ఈ మూవీ ఒక సంచలనం. 1982లో ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ ప్రధాన పాత్రలో అప్పట్లో వచ్చిన చిత్రం.. ర్యాంబో ఫస్ట్ బ్లడ్. ఆ మూవీకి, ఖైదీకి చాలా దగ్గరి పోలికలు కనిపిస్తాయి. కానీ ఖైదీ మూవీ పూర్తిగా ప్రత్యేకం. ఇందులో హీరో తనకు అన్యాయం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు. అందులో భాగంగా అతను ఏం చేశాడనేది మనకు సినిమాలో కనిపిస్తుంది. ఖైదీ సినిమాలో ప్రతి ఒక్క సీన్ ఒక్కో భావోద్వేగాన్ని కలిగిస్తుంది. అందుకనే చిరంజీవి ఆ మూవీతో నటుడిగా అగ్రస్థానానికి చేరుకున్నారు.

చిరంజీవిని నటుడిగా అగ్రస్థానంలో నిలిపిన మూవీ ఖైదీ అయితే.. అయనకు అమితమైన ఫ్యాన్స్ ఏర్పడేలా చేసింది.. గ్యాంగ్ లీడర్ మూవీ. ఆ మూవీ టైటిలే అప్పట్లో యువతను బాగా ఆకట్టుకుంది. నిజానికి గ్యాంగ్ లీడర్‌లో చిరంజీవి పోషించిన పాత్ర సహజంగానే సమాజంలో కొందరు యువత క్యారెక్టర్లకు దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ మూవీని బాగా ఆదరించారు. ఇక అన్నదమ్ముళ్ల అనుబంధం, స్నేహితుల కోసం ఏం చేయడానికైనా వెనుకాడని తత్వంతో రాజారాం (చిరంజీవి) పాత్ర మనకు కనిపిస్తుంది. చిరంజీవి కెరీర్‌లో ఖైదీ, గ్యాంగ్ లీడర్ రెండు సినిమాలు దేనికదే ప్రత్యేకం. అయినప్పటికీ ఆయనకు అంతలా స్టార్ డమ్, ఫ్యాన్స్‌ను తెచ్చి పెట్టింది ఈ రెండు సినిమాలే అని చెప్పవచ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news