నారప్ప మూవీ వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే!

కరోనా దెబ్బకు సినిమా లోకం కకావికలం అవుతోంది. చిన్న సినిమా, పెద్ద సినిమా అని లేదు. ఏదైనా దీని దెబ్బకు పక్కకు తప్పుకుంటున్నాయి. ఇప్పటికే ఆచార్య, లవ్ స్టోరీ, విరాటపర్వం లాంటి సినిమాలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వేవ్ విపరీతంగా ఉండటంతో.. థియేటర్లు కూడా మూసివేశారు. దీంతో ఇప్పుడు మరో సినిమా వాయిదా పడింది.

విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రియమణి హీరోయిన్ గా నటించిన నారప్ప సినిమా విడుదలను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. మే 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సినిమాను విడుదల చేయలేమని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పరిస్థితులు చక్కబడిన తర్వాత థియేటర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని వివరించారు. ఇక ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ కు రీమేక్ గా తెలుగులో నారప్పగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసందే. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పోస్టర్లు భారీగా అంచనాలు పెంచేశాయి. వెంకటేశ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు.