నా ప్రాణమా పరీక్షలా…? కేయే పాల్ దీక్ష

కరోన తీవ్రత దృష్ట్యా టెన్త్ , ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేయాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా విజృంభిస్తున్న సమయంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు పెట్టడం సరికాదు అని అన్నారు. ఇదే అంశంపై తాను వేసిన పిటీషన్ ను ఏపి హైకోర్టులో అడ్మిట్ చేశారు అని తెలిపారు. రేపే వాదనలు జరుగుతాయని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు.

35 లక్షల మంది విద్యార్ధి లోకానికి మేలు జరిగే వరకు తన దీక్ష కొనసాగుతుంది అని ఆయన వివరించారు. నా పిల్లలను పరీక్షలకు పంపను అని పరీక్షలను రద్దు చేయమనలేదు, పాస్ చేయమనలేదు. రెండు నెలలు వాయిదా వేయమని కోరాము అని ఆయన తెలిపారు. పరీక్షలు వాయిదా పదేవరకు…దీక్ష కొనసాగిస్తాను..నా దీక్ష దగ్గరకు ఎవరూ రావద్దు అంటూ ఆయన కోరారు.