మాయ చేయనున్న తమన్, బాలయ్య-బోయపాటి మూవీ కి బంగారు బుల్లోడు లోని హిట్ సాంగ్

టాలీవుడ్ కు సంబంధించి ఇప్పుడు ఒక వార్త హల్ చల్ చేస్తుంది. అదే తమన్ సంగీత దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో హిట్ మూవీ గా నిలిచిన బంగారు బుల్లోడు లోని ఒక హిట్ సాంగ్ ను బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా చేస్తున్న మూవీ కోసం రీమిక్స్ చేస్తున్నారట. వివరాల్లోకి వెళితే…. నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను దర్శకత్వంలో తాజాగా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే ఒక వార్త హల్ చల్ చేస్తుంది. అదే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎస్.ఎస్. తమన్ ను తీసుకున్నారని, ఈ చిత్రం కోసం తమన్ అప్పుడే తన పని కూడా మొదలు పెట్టేసినట్లు తెగ ప్రచారం జరుగుతుంది. దానికి తోడు బాలయ్య కెరీర్ లో హిట్ మూవీస్ లో ఒకటి అయిన బంగారు బుల్లోడు చిత్రం నుంచి ఒక మంచి హిట్ సాంగ్ ను ఈ చిత్రంలో రీమిక్స్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఇంకా చిత్ర యూనిట్ తమన్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించనే లేదు కానీ అప్పుడే ఇలాంటి ప్రచారాలు మాత్రం జరిగిపోతున్నాయి.

అయితే ఇంతకీ బంగారు బుల్లోడు లో ఆ హిట్ సాంగ్ ఏంటి, ఆ చిత్ర కమామిషం ఏంటి అన్న ఆలోచనలో పడ్డారు అందరూ. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ,లెజెండ్ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం కూడా అదే రేంజ్ లో హిట్ చేయాలని బోయపాటి పక్కా ప్లానింగ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.