కోటి ఇస్తామ‌న్నా నో చెప్పిన కాజ‌ల్‌

-

కాజల్ అగర్వాల్ పక్కా ప్రొఫిషనల్. సినిమా లైఫ్ కోసం వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టింది. సినిమాలతో బిజీగా ఉండడం వల్ల తన చెల్లెలు నిషా కి పెళ్లి చేసి తాను మాత్రం నటనతోనే జీవిస్తోంది. రీసెంట్ గా ఖైదీ నంబర్ 150 , నేనే రాజు నేనే మంత్రి వంటి విజయాలందుకున్న ఈ బ్యూటీ మళ్ళీ తేజ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమైంది. ఎంత ప్రొఫిషినల్ అయినప్పటికీ తనకి డబ్బుపై వ్యామోహం లేదని స్పష్టం చేసింది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ జనతా గ్యారేజ్ సినిమాలో ఐటెం సాంగ్ చేసేసరికి డబ్బు కోసం ఏమైనా చేస్తుందని కొంతమంది పొరబాటుపడ్డారు.

అది ఎన్టీఆర్ తో స్నేహం కోసం చేసినట్లు గ్రహించలేకపోయారు. అందుకే ఇప్పుడు అవమానపడ్డారు. అతనే స్టార్ డైరక్టర్ జయంత్ సి పరాన్జీ. ఇతను స్టార్ హీరోలతో విజయాలను అందుకున్నారు.కానీ ఈ మధ్య అతనికి హిట్ లేకుండా పోయింది. మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావాలని తెగ ప్రయత్నిస్తున్నారు. నీలేష్ అనే యువ హీరోను తెలుగుతెరకు పరిచయం చేస్తూ “నరేంద్ర” అనే సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నారు. పది కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు కాస్త గ్లామర్ టచ్ ఇచ్చేందుకు ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశాడట. అందుకోసం టాలీవుడ్ యువరాణి కాజల్ ను సంప్రదించినట్లు తెలిసింది. మూడు రోజులు కేటాయిస్తే కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇస్తానని అన్నారట. అందుకు కాజల్ నో చెప్పిన్నట్లు సమాచారం. కోటి కి తప్పకుండా ఒప్పుకుంటుందని అంచనా వేసిన జయంత్ కి షాక్ తగిలింది. దీంతో అతను వేరే భామను సంప్రదించేపనిలో పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version