Hari Hara Veera Mallu: లవర్స్ డే ట్రీట్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను నటిస్తున్న హరి హరి వీరమల్లు సినిమా నుంచి బిగ్ సర్ ఫ్రైజ్ ఇచ్చారు.ఈ సినిమా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. కొల్లగొట్టిందిరో అంటూ సాగే.. ఓ రొమాంటిక్ సాంగ్ ను ఫిబ్రవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్‌చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు హీరోయిన్ నిధి అగర్వాల్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రొమాంటిక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కాగా ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే… హరిహర వీరమల్లు మూవీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రానుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ స్వరకర్త MM కీరవాణి సంగీతం అందించారు. హరిహర వీరమల్లు మార్చి 28న థియేటర్లలోకి రానుందని చిత్ర బృందం ఇప్పటికే ధృవీకరించింది.
https://twitter.com/HHVMFilm/status/1890262485577630035