మోహన్ బాబు బౌన్సర్లకు హీరో మంచు మనోజ్ షాక్ ఇచ్చారు. మోహన్ బాబు బౌన్సర్ల పై పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. నిన్న రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీ ఎదుట ఉన్న F5 రెస్టారెంట్ పై దాడి చేశారు మోహన్ బాబు బౌన్సర్లు. హేమాద్రి నాయుడు అనే వ్యక్తితో పాటు బౌన్సర్లపై చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్.
ఇక అంతకు ముందుకు మంచు మనోజ్ మాట్లాడారు. మోహన్ బాబు బౌన్సర్లు ధ్వంసం చేసిన F5 రెస్టారెంట్‌ను పరిశీలించినట్లు తెలిపారు. కోట్లు వెచ్చించి, లోన్లు తీసుకుని హాస్టళ్లు, హోటళ్లు పెట్టుకుని బతుకుతున్నారని వెల్లడించారు మంచు మనోజ్. మోహన్ బాబు సిబ్బంది హేమాద్రి నాయుడు, ఫోటోగ్రాఫర్ మౌళి వారిని కొట్టి బెదిరించి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రశ్నిస్తే వారిపై బౌన్సర్లు దాడికి పాల్పడుతున్నారు… ఇలాంటి ఫిర్యాదులు నా దృష్టికి రావడం, ప్రశ్నించడం మొదలైనప్పటి నుంచి నాపై అభాండాలు వేస్తున్నారని ఆగ్రహించారు.