ఆ ఎన్.టి.ఆర్ ని మించిపోతున్న ఈ ఎన్.టి.ఆర్

-

టాలీవుడ్ లో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ లా మరెవరూ బేస్ వాయిస్ తో పవర్ ఫుల్ గా డైలాగ్స్ చెప్పలేరన్న విషయం ఒప్పుకొని తీరాల్సిందే అని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. తాత ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడని డైలాగ్ డెలివరీ విషయంలో ఆ ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ ఈ ఎన్టీఆర్ అని అందరూ చెప్పుకుంటారు. ఈ విషయం చాలా సినిమాలలో నిరూపితమయినప్పటికి రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ సినిమాతో ఈ విషయం ఇంకా స్పష్టమైంది. తెలుగు పదాల్ని పలకడంలో..ఎక్కడ పిచ్ పెంచాలో ఎప్పుడు తగ్గించాలో.. సన్నివేశం తగ్గట్టుగా ఎమోషన్ను మాటల్లో సరిగ్గా క్యారీ చేయడంలో ఎన్టీఆర్ ని కొట్టిన వాళ్ళు ఇంకెవరూ లేరని చాలాసార్లు తేలిపోయింది. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్ర ‘రౌద్రం రణం రుధిరం’. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం లో ఎన్టీఆర్ స్వాతంత్ర సమరయోధుడు ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు.

 

‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో తన డైలాగ్ డెలివరీ ఎలా ఉండబోతుందో జక్కన్న సాంపిల్ చూపించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా చరణ్ పాత్ర ఎలా ఉండబోతుందో తెలియడానికి ఒక వీడియో టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో ఎన్టీఆర్ వాయిస్ విన్న ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ లో హీరోని ఎలివేట్ చేస్తూ డైలాగ్ చెప్పిన విధానం ఎంతో అద్భుతంగా ఉంటూ యావత్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు ఎన్టీఆర్ తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ ఈ రేంజ్ లోనే డైలాగ్స్ చెప్పి మైండ్ బ్లోయింగ్ అనిపించాడు. ముఖ్యంగా హిందీలో ఎన్టీఆర్ బేస్ వాయిస్ తో ఇచ్చిన వాయిస్ ఓవర్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది.

ఒక్క మళయాళం లో తప్ప మిగతా భాషల్లో మాత్రం ఎన్టీఆర్ అద్భుతం అనిపించాడు. ఇక చరణ్ ని చూసిన వాళ్ళు ఎన్టీఆర్ ఎలా ఉంటాడో అన్న కుతూహలం తో ఊగిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ని చూస్తామా అన్న ఉత్సాహంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక రాజమౌళి ఎన్టీఆర్ క్యారెక్టర్ ని కూడా త్వరలో రివీల్ చేయనున్నారని తెలుస్తుంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని 2021 జనవరి 8 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఏదేమేనైనా ఎన్టీఆర్ ఆ ఎన్టీఆర్ తర్వాత నటనతో పాటు అన్ని అంశాలలోను తాతకి తగ్గ మనవడు అనిపించుకుంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news