అవును కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఇప్పుడు మనకు సామాజిక దూరం ఎంత అవసరమో మన వైద్యులను కాపాడుకోవడం కూడా చాలా అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్టు ఇప్పుడు వైద్యులను కాపాడుకోవడం అనేది చాలా అవసరం. కరోనా వైరస్ సమయంలో ధైర్యంగా నిలబడిన, వైద్యులు, నర్సులను ప్రధాని మోదీ తాజాగా మరోసారి అభినందించారు. తాజాగా ఆయన నర్సు ఛాయతో మోదీ 5 నిమిషాల పాటు మాట్లాడారు.
వారి యోగక్షేమాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆమెను అక్కడ బాగా చూసుకుంటున్నారా లేదా అని ప్రధాని మోదీ సిస్టర్ ఛాయను అడగగా… తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, రోగులతో పాటు తనను బాగా చూసుకుంటున్నారని, కరోనా బాధితులకు చికిత్స అందించడానికి వచ్చిన ఆమె, తమ కుటుంబసభ్యులను ఎలా ఒప్పించగలిగారని ప్రధాని మోదీ నర్సు ఛాయను ప్రశ్నించారు.
ఆస్పత్రికి బయలుదేరే సమయంలో తమ కుటుంబసభ్యులు ఆందోళన చెందలేదా? అని ఆయన ఆమెను అడిగారు. తమ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతారని, అయితే, దేశం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సేవలు అందించడానికి ముందుండాలని, ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఓ సిస్టర్ తన అవసరం ఎవరికి ఎక్కువ ఉందో తనకుటుంబం అర్థం చేసుకుందని వ్యాఖ్యానించారు.
ఎవరైనా కరోనా బాధితుడు ఆస్పత్రికి వచ్చినప్పుడు చాలా భయపడతారు కదా అని మోడీ ఆమెను అడగగా… అందుకు ఔనని ఆమె సమాధానం ఇచ్చారు. వారికి కరోనా నిర్ధారణ అయిందని, వారిని అడ్మిట్ కావాల్సిందిగా కోరితే మరింత భయపడతారని, ఆ తర్వాత తాము వారితో మాట్లాడతామని, వారి భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తామని ఆమె వ్యాఖ్యానించారు. ఒక వేళ వారికి కరోనా పాజిటివ్ వచ్చినా కూడా భయపడాల్సిన పనిలేదని చెబుతామన్నారు.