చీర కట్టులో కవ్విస్తున్న ఆషికా రంగనాథ్..!

-

సినీ ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోలు, హీరోయిన్లు పుట్టుకొస్తూనే ఉంటారు. ఇక అలా వచ్చిన వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఈ కోవలోనే కన్నడలో ఇప్పటికే హీరోయిన్గా సత్తా చాటిన ఆషికా రంగనాథ్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఇకపోతే ఈ సినిమా తోనే తెలుగులో పాగా వేయాలనుకున్న ఈమె సినిమా రిజల్ట్ బెడిసి కొట్టడంతో ఈమె ఆశలు కాస్త అడియాశలు అయ్యాయని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకున్న ఈ భామకు తెలుగులో మంచి ఎంట్రీ దక్కినా ఫలితం మాత్రం దక్కలేదు.

2016లో కన్నడలో తెరకెక్కిన క్రేజీ బాయ్ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో దిలీప్ ప్రకాష్ హీరోగా నటించారు. ఇక ఈ సినిమా అక్కడ మంచి విజయం అందుకోవడంతో ఈమెకు కూడా మంచి పేరు లభించింది. ఈ సినిమా తర్వాత శివరాజ్ కుమార్ హీరోగా వచ్చిన మాస్ లీడర్ సినిమాలో కూడా నటించింది. అంతేకాదు పునీత్ రాజకుమార్ హీరోగా నటించిన జేమ్స్ అనే సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. 2016 నుంచి 2022 వరకు కన్నడ ఇండస్ట్రీ పైనే దృష్టి సారించిన ఆషిక, ఆ తర్వాత 2022లో తొలిసారి అధర్వ హీరోగా నటించిన పట్టాతు అరసన్ అనే సినిమా ద్వారా తమిళ్ ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఇప్పుడు మళ్లీ తెలుగులో వచ్చిన ఈమె ప్రేక్షకులను ఆకట్టుకోలేదు . కాబట్టే తన అందచందాలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.. తాజాగా కేరళ స్టైల్ లో చీర కట్టుకొని తన అందాలతో యువతను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఆరంజ్ కలర్ శారీలో కేరళ స్టైల్ లో చీర ధరించి వయ్యారంగ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు అభిమానుల సైతం ఫిదా అవుతున్నారు. మొత్తానికైతే ఈ ముద్దుగుమ్మ అందాలు మరింత హీట్ పెంచేస్తున్నాయని చెప్పాలి.

 

View this post on Instagram

 

A post shared by Ashika Ranganath (@ashika_rangnath)

Read more RELATED
Recommended to you

Latest news