ఎస్బీఐ అమృత్ కలష్ లో లక్ష పెడితే.. ఎంత వస్తుంది..?

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎస్‌బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్ ని కూడా తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. 400 రోజుల వ్యవధి ఉండే ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ఇది. గతంలో ఈ స్కీమ్ గడువు మార్చి 31, 2023తో ముగిసినా దీన్ని మరో మూడు నెలలు పొడిగించింది. ఈ స్కీమ్ లో డబ్బులని డిపాజిట్ చేస్తే అధిక లాభం ఉంటుంది.

ఇతర బ్యాంకుల్లోని స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్‌ తో పోలిస్తే ఈ స్కీములో కాస్త ఎక్కువ వడ్డీ వస్తుంది. అమృత్ కలశ్ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ ఏప్రిల్ 12 నుంచి మరొక సారి అందుబాటులోకి తీసుకు వచ్చారు. దీని ద్వారా జనరల్ కస్టమర్లకు 7.10 శాతం వడ్డీ రేటు వస్తుంది. అదనంగా 50 బేసిస్ పాయింట్లు వడ్డీ సీనియర్ సిటిజన్లకు వస్తుంది. సీనియర్ల సిటిజెన్ల డిపాజిట్లపై 7.60 శాతం వడ్డీ వస్తుంది. ఈ పథకంలో చేరేందుకు గడువు జూన్ 30, 2023గా నిర్ణయించింది. అమృత్ కలశ్ స్పెషల్ స్కీమ్‌లో డొమెస్టిక్ రిటైల్ టర్మ్ డిపాజిట్లు రూ.2 కోట్ల లోపు చెయ్యాలి. బ్రాంచ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో చానల్ ద్వారా తీసుకోచ్చు.

ప్రీమెచ్యూర్ విత్ డ్రా సౌకర్యం కూడా వుంది. గడువు ముగిసిపోక ముందే అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. నెలవారీగా లేదా మూడు, ఆరు నెలల వ్యవధుల్లో వడ్డీ ని ఇస్తుంది బ్యాంకు. ఎస్‌బీఐ సాధారణ వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 10 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్ల పై 3 శాతం నుంచి గరిష్ఠంగా 7 శాతం వరకు వడ్డీ ఉంటుంది. అదనంగా 50 బేసిస్ పాయింట్లు సీనియర్ సిటిజన్లకు లభిస్తుంది. అమృత్ కలశ్ స్పెషల్ 400 ఎఫ్‌డీ స్కీమ్‌లో సాధారణ కస్టమర్ రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే 7.10 వడ్డీ వర్తిస్తుంది. అంటే మెచ్యూరిటీ సమయానికి అదనంగా రూ.7,100 అందుతాయి. రూ.1 లక్ష డిపాజిట్ చేసినట్లయితే వారికి 7.60 శాతం వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ కి అదనంగా రూ.7,600 అందుతాయి. మొత్తందా 1,07,600 అమౌంట్ ని పొందవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news