డ్రైవర్ ను నమ్మితే 100 కోట్లు ముంచాడట..!

90ల కాలంలో హీరోగా.. విలన్ గా.. సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించిన పృధ్విరాజ్ కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఈమధ్య మళ్లీ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అలరిస్తున్న పృధ్వి రాజ్ తన కెరియర్ కు సంబందించిన విషయాలతో పాటుగా డ్రైవర్ చేసిన పని వల్ల కోట్ల రూపాయలు ఎలా లాస్ అయ్యాడో చెప్పాడు. ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న పృధ్వి రాజ్ అప్పట్లో తనకు వచ్చిన రెమ్యునరేషన్ 10 లక్షలు శంషాబాద్ దగ్గర 100 ఎకరాలు కొందామని అనుకున్నాడట.

అయితే తన కార్ డ్రైవర్ చెప్పడం వల్ల అక్కడ కొనలేకపోయానని.. శంషాబాద్ లో ప్లేస్ తీసుకుంటే ఇప్పుడు 100 కోట్లు తన ఖాతాలో ఉండేవని చెప్పాడు. అయితే శంషాబాద్ లో ప్లేస్ లో బదులుగా ఓ ప్లాట్ కొన్నానని చెప్పాడు పృధ్విరాజ్. కొన్నాళ్ల క్రితం పృధ్వి సూసైడ్ కూడా చేసుకోవాలని అనుకున్న విషయాన్ని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు పృధ్వి.