ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డింపుల్ బ్యూటీ లావణ్య త్రిపాఠీల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జంట త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ జంట వెకేషన్లో ఉన్నట్టుంది. తాజాగా ఈ జంట విదేశాల్లో దిగిన ఓ ఫొటోను తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఆ ఫొటో కింద తమ ఎంగేజ్‌మెంట్‌కు విషెస్ తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ క్యాప్షన్ రాశారు. వరుణ్, లావణ్య ఒకే ఫొటోను, ఒకే క్యాప్షన్‌తో షేర్ చేశారు.
అందులో లావణ్య.. వరుణ్ తేజ్ చేయి పట్టుకుని నడుస్తూ.. చిరునవ్వు చిందిస్తూ కనిపించారు. ఇరువురి అభిమానులు, సినీ ప్రముఖులు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారు షేర్ చేసిన కొన్ని క్షణాల్లోనే ఆ ఫొటోకు లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం నెట్టింట ఆ ఫొటో వైలర్‌గా మారింది.
2017లో విడుదలైన ‘మిస్టర్’ సినిమా కోసం వరుణ్- లావణ్య తొలిసారి కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే వీరిద్దరూ స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఏడాదిలోనే వీరి కాంబినేషన్‌లో ‘అంతరిక్షం’ చిత్రం వచ్చింది. ఇక ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.
Thanks to and each & everyone for the warm wishes! ♾️♥️@Itslavanya pic.twitter.com/x0rpL27Ovw
— Varun Tej Konidela (@IAmVarunTej) June 13, 2023