ప్రభాస్ కి విలన్ ఆయనే.. దాన్నే నిజం చేశారు !

-

ప్రభాస్ ఆదిపురుష్ టీమ్ నుండి ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది. నిన్న సాయంత్రం చెప్పినట్టుగానే ఈరోజు ఉడడం 7 : 11 నిముషాలకి ఈ అప్డేట్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ముందు నుండి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ సినిమాలో విలన్ గురించే అప్డేట్ ఇచ్చారు. ఆ విలన్ కూడా ముందు నుండి ప్రచారంలో ఉన్న పేరే, అదే సైఫ్ అలీ ఖాన్.

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరయిన ఈయన ఈ మధ్య కాలంలో కాస్త జోరు తగ్గించాడు. కానీ తానాజీ రిలీజ్ తో మళ్ళీ ఊపు మీదకు వచ్చాడు. ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలు లైన్ లో పెట్టిన ఈయన్ని ఆది పురష్ లో రావణుడిగా ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. ఇక ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాని తానాజీ ఫేం దర్శకుడు ఓం రౌత్ తెరకేక్కిస్తున్నాడు. ఇంకా హీరోయిన్ ఎవరనే దాని మీద క్లారిటీ లేదు. టీ సిరీస్ గుల్షన్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే నెలకొని ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news