NTR 30 తర్వాత తారక్ సినిమా లైనప్ మామూలుగా లేదుగా..?

-

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయారు తారక్.. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను తెరకెక్కించబోతున్నారు.  వాస్తవానికి ఆర్.ఆర్.ఆర్ మూవీ తర్వాత వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేయాలనుకున్న తారక్.. చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. ఇప్పుడు అదే సినిమాను మహేష్ బాబుతో చేస్తున్నారు త్రివిక్రమ్. కనీసం భవిష్యత్తులోనైనా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరొకవైపు కొరటాల శివతో సినిమా పూర్తి అయిన వెంటనే తన 31వ చిత్రాన్ని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేయబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు.
తారక్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి. ఇక ఈ చిత్రం స్వాతంత్రం తర్వాత భారత్  – పాకిస్తాన్ విడిపోయిన కాలం నుంచి ఆ తర్వాత భారత్ – పాక్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఈ యుద్ధంలో మన భారత యోధులు ఏ విధంగా పోరాటం చేశారనే ఇతివృత్తంతో సినిమాను తెరకెక్కించబోతున్నారు.  దీనికి అసురా అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చేసినట్లు తెలుస్తోంది..
ఆ తర్వాత తారక్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారట . ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మించబోతున్నట్లు సమాచారం.  అంతేకాదు మరొకవైపు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా తో కూడా ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.  ఆ తర్వాత అనిల్ రావిపూడి తో కూడా ఒక సినిమా చేసే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.. మరొకవైపు లోకేష్ కనకరాజు కూడా ఈయనతో సినిమా చేయడానికి ముందుకు వచ్చారట. ఇక దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ సినిమా లైనప్ మామూలుగా లేదని స్పష్టం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news