ఓటీటీలోకి అఖిల్‌ ‘ఏజెంట్‌’.. స్ట్రీమింగ్‌ అయ్యే వేదిక ఇదే!

-

వరుస ఫ్లాప్ లతో గాడి తప్పుతున్న అక్కినేని అఖిల్ సినీ కెరీర్ ఏజెంట్ తో అయినా గాడిలో పడుతుంది అనుకుంటే అదీ నిరాశే అయింది. అఖిల్‌ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌’ శుక్రవారం విడుదలైన థియేటర్స్‌లో సందడి చేస్తోంది. ‘ఏజెంట్‌’ కోసం అఖిల్‌ పడిన కష్టం, యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే డిజిటల్‌, ఓటీటీ రైట్స్‌ రూపంలో బాగానే బిజినెస్‌ జరిగినట్లు సమాచారం. ఇక ‘ఏజెంట్‌’ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ స్ట్రీమింగ్‌ వేదిక ‘సోనీలివ్‌’ దక్కించుకుంది. థియేట్రికల్‌ రన్‌ పూర్తయిన తర్వాత సోనీలివ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.

‘ఏజెంట్‌’లో అఖిల్‌ రిక్కీ అలియాస్‌ రామకృష్ణ అనే పాత్రలో నటించాడు. స్పై అవ్వడమే లక్ష్యంగా కష్టపడినా ప్రతిసారీ ఇంటర్వ్యూలో రిజెక్ట్‌ అవుతుంటాడు. ఈ క్రమంలో  ‘రా’ చీఫ్‌ డెవిల్‌ అలియాస్‌ మహదేవ్‌ (మమ్ముట్టి) మిషన్‌ రాబిట్‌ను అడ్డుకునేందుకు రిక్కీని రంగంలోకి దించుతాడు. మరి రిక్కీ ‘మిషన్‌ రాబిట్‌’ను ఎలా అడ్డుకున్నాడు?వైద్య (సాక్షి వైద్య)తో అతని ప్రేమాయణం ఏమైంది? ఈ కథలో కేంద్రమంత్రి జయకిషన్‌ (సంపత్‌ రాజ్‌) ఏంటి? అన్నది మిగతా కథ.

Read more RELATED
Recommended to you

Latest news