బ్రేకింగ్: బాలీవుడ్ స్టార్ హీరో తమ్ముడు మృతి…!

-

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ తమ్ముడు అనిల్ దేవ్‌గన్ సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 51 ఏళ్ళ అనీల్ దేవగన్ మరణించిన విషయాన్ని అజయ దేవగన్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభమైన అనిల్ కెరీర్… ఆ తర్వాత దర్శకుడిగా మారింది. రాజు చాచా, బ్లాక్ మెయిల్, హాల్-ఎ-దిల్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

“నేను నిన్న రాత్రి నా సోదరుడు అనిల్ దేవ్‌గన్‌ను కోల్పోయాను. అతని అకాల మరణం మా కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, అజయ్ దేవ్‌గన్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ యొక్క క్రియేటివ్ డైరెక్టర్‌గా అనిల్ దేవ్‌గన్ పనిచేశారు. కాగా అజయ్ దేవ్‌గన్ తన తండ్రి వీరు దేవ్‌గన్‌ ను గత ఏడాది కోల్పోయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news