దిల్ రాజు సినిమా వాయిదాతో అజిత్ సూపర్ హ్యాపీ..!!

-

సంక్రాంతి పండుగ తెలుగు ప్రాంతాలలో భారీ ఎత్తున జరిగే పెద్ద పండుగ. ఈ పండుగ సందర్భంగా  విడుదల అయిన సినిమాను మినిమం గ్యారెంటీ ఉంటుంది.అందుకే చాలా మంది షూటింగ్ త్వరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో వుండాలని కోరుకుంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య , విజయ్, అజిత్ అందరూ  సంక్రాంతి బరిలో ఉన్నారు.

కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య  సినిమాను  సంక్రాంతి  పండుగ సందర్భంగా 13 న రిలీజ్ చేస్తున్నారు. అలాగే  బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య బాబు సినిమా వీర సింహ రెడ్డి సినిమా , ఒక రోజు ముందుగానే అంటే జనవరి 12వ తేదీ న విడుదల కాబోతుంది. ఇక దిల్ రాజు సినిమా వారసుడును ముందుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా తెర వెనుక మంత్రాంగం నడిచి 14 కు వాయిదా పడింది.

దీనితో అజిత్ సినిమా తెగింపు కు సూపర్ గా ప్లస్ అయ్యింది.జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అసలు థియేటర్స్ దొరుకుతాయా లేదా….ఓపినింగ్స్ వస్తాయా..ప్రమోషన్ లేదే అని అందరూ కామెంట్స్ చేసారు. కానీ సంక్రాంతి రేసులో మొదటగా ఈ సినిమానే ఇక్కడ రిలీజ్ అవటం కలిసివస్తోంది. దిల్ రాజు సినిమా వెనక్కి వెళ్ళడం తో గోల్డెన్ ఛాన్స్ లభించింది. ఇక ఈ మూవీ కి మంచి ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news