Akshay Kumar: శివుడి అవ‌తార‌మెత్తిన అక్ష‌య్ ! ఆ కొత్త‌ క‌థేమిటీ?

-

Akshay Kumar: బాలీవుడ్‌లో కాస్త డిఫ‌రెంట్ గా ప్రయోగాత్మక, సందేశాత్మక, సామాజిక సమస్యల సినిమాలు చేస్తూ.. ప్రేక్ష‌కుల‌ను ఆలోజింప‌జేసే న‌టుడు అక్ష‌య్ కుమార్. ఆయ‌న చిత్రాలు విభిన్నంగా ఉన్న హిట్ల మీద హిట్లు కొడుతుంటారు. తాజాగా మరో సినిమాతో మన ముందుకు రానున్నారు. అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం ‘ఓ మైగాడ్‌’.

ఈ చిత్రంలో ఆయ‌న లార్డ్ కృష్ణ క్యారెక్టర్‌లో కనిపించి, మెర్మారైజ్ చేసిన‌ట్టు చేశారు. బాలీవుడ్ లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. అంతేకాదు పవన్‌, వెంకటేష్ హీరోలుగా ‘గోపాల గోపాల’ అనే పేరుతో తెలుగులో కూడా రిమేక్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం కూడా తెలుగులో ఘన విజయం సాధించింది.

ఇప్పుడూ ఈ చిత్రానికి సీక్వెల్ ‘ఓ మై గాడ్‌ 2’ గా తెర‌కెక్కిస్తున్నారు. ఈ విష‌యాన్ని శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ఈ చిత్రంలో శివుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ని ట్విట్టర్ వేదిక‌గా రిలీజ్ చేశారు. నిజాయతీతో కూడిన ప్రయత్నమే ఈ చిత్రం.

“ఆ ఆదియోగి ఆశీర్వాదాలు మా ప్రయాణమంతా ఉండాలని ఆశిస్తున్నాం. అలాగే మీ ఆశీర్వాదం కూడా మాకు కావాలి, హర హర మహదేవ్‌’ అంటూ రాసుకొచ్చాడు అక్ష‌య్. పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌ ఈచిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాకి అమిత్‌ రాయ్ దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. కేప్‌ ఆఫ్‌ గాడ్‌ ఫిల్మ్‌ సంస్థ నిర్మిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news