‘ అల ‘ టీజ‌ర్ వ‌చ్చేస్తుంది… బ‌న్నీ ఫ్యాన్స్‌కు పండ‌గే

ఈ హెడ్డింగ్ చూసిన వెంట‌నే బ‌న్నీ ఫ్యాన్స్ అంద‌రూ ప్ర‌తి ఒక్క‌రు ఫుల్ ఖుషీ అయిపోతారు. అయితే వ‌చ్చింది అల వైకుంఠ‌పురం టీజ‌ర్ కాదు.. ఈ టీజ‌ర్ అప్ డేటు మాత్రమే. నిన్న (ఆదివారం) రావాల్సిన ‘అల.. వైకుంఠపురంలో’ టీజర్ రిలీజ్ అప్ డేట్ మెగా ఫ్యామిలీ వీరాభిమాని నూర్ భాయ్ మృతితో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక టీజ‌ర్ ఎప్పుడు రిలీజ్ చేసేది సోమ‌వారం ప్ర‌క‌టిస్తామ‌ని గీతా ఆర్ట్స్ ఆదివార‌మే అధికారికంగా ప్ర‌క‌టించింది.

 

తాజాగా టీజర్ అప్ డేటు ఇవాళ వచ్చేసింది. టీజర్ అప్ డేటుకి సంబంధించిన పోస్టర్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ నెల 11న అంటే బుధవారం టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌ర్వాత ఈ సినిమాతో హిట్ కొడ‌తామ‌న్న ధీమాతో త్రివిక్ర‌మ్‌, బ‌న్నీ ఉన్నారు.

బ‌న్నీ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్. బాలీవుడ్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 అల.. ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్ప‌టికే థ‌మ‌న్ స్వ‌ర‌ప‌ర్చిన పాట‌లు సోష‌ల్ మీడియాలో జోరుగా ట్రైండ్ అవుతున్నాయి.