`ఆర్ఆర్ఆర్‌`పై అలియా ట్వీటేసింది!

-

గ‌త ఏడు నెల‌లుగా ఆగిపోయిన మోస్ట్ క్రేజీయెస్ట్ ఫిల్మ్ `ఆర్ఆర్ఆర్‌` ఈ నెల 5న ప్రారంభ‌మైంది. ఈ రోజె కోసం మెగా  ఫ్యాన్స్ తో పాటు ఎన్టీఆర్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఆ రోజు రానే వ‌చ్చింది. రెండు వారాల పాటు ఈ మూవీకి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించ‌బోతున్నారు రాజ‌మౌళి. ఈ విష‌యాన్ని `ఆర్ఆర్ఆర్‌` టీమ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ వీడియోని కూడా వ‌దిలిన జ‌క్కన్న గ‌త ఐదు నెల‌లుగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ నెల 22న ఎన్టీఆర్ భీమ్‌కి సంబంధించిన లుక్‌తో పాటు టీజ‌ర్‌ని కూడా రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించేశాడు. ఇందులో అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్‌, కొమ‌రంభీంగా ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. సీత పాత్ర‌లో బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ క‌నిపించ‌బోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అలియా సెట్‌లోకి ఎంట‌ర్ కాలేదు.

ఈ సినిమాలో అలియా నటిస్తుందా? లేదా అన్న అనుమానాలు త‌లెత్తుతున్న నేప‌థ్యంలో అలియాభ‌ట్ తొలిసారి `ఆర్ఆర్ఆర్‌`పై ట్వీటేసింది. ` బ్లూ హార్ట్ జట్టులో చేరాలని ఎదురు చూస్తున్నాను వేచి ఉండండి` అని రాజ‌మౌళి ట్వీట్ చేసిన వీడియోని షేర్ చేసి ఈ మూవీ విష‌యంలో త‌న‌పై వ‌స్తున్న రూమ‌ర్‌ల‌కు చెక్ పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news