మరోసారి తల్లి కాబోతున్న ఆలియా.. నిజమేనా..?

-

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ గత ఏడాది తాను ప్రేమించిన బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం జరిగిన ఎనిమిది నెలలకే ఒక పాప జన్మించింది. అంటే 9 నెలల గర్భంలో ఎనిమిది నెలలకే పాప ఎలా జన్మించింది అనే వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. కానీ ఈ విషయంపై ఆలియా స్పందించి.. నిజమే తాను పెళ్ళికి ముందే గర్భం దాల్చాను అని చెప్పి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇకపోతే ఇప్పుడు మరొకసారి ప్రెగ్నెంట్ అయింది అనే వార్తలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

నిజానికి గత ఏడాది ఏప్రిల్ 14న ముంబైలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న ఈ జంట అలా పెళ్లి చేసుకుందో లేదో ఇలా నవంబర్ ఆరో తేదీన ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం తమ గారాలపట్టితో ఎంజాయ్ చేస్తున్న ఈ జోడి కి సంబంధించి ఇప్పుడు మరొక వార్త వైరల్ గా మారుతుంది . ఆలియా మరోసారి ప్రెగ్నెంట్ అయింది అంటూ బీ టౌన్ లో కథనాలు వెలబడుతున్నాయి. త్వరలోనే ఆమె రెండో బిడ్డకు వెల్కం చెప్పబోతోంది అంటూ షికారు చేస్తున్న వార్తలు ఇప్పుడు జనాల్లో డిస్కషన్ పాయింట్ గా మారిపోయాయి.

అయితే ఈ విషయంలో ఎంత నిజం ఉంది అనేది మాత్రం ఇంకా తెలియలేదు. ముఖ్యంగా ఆలియా రెండవసారి గర్భం దాల్చినట్టయితే ఆమె ముందే చెబుతుంది కదా.. ఒకవేళ ఇదే నిజమైనా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఏడాది లోపే డబుల్ ధమాకా కొట్టేసింది ఈ జంట అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news