అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పండగే..పుష్ప 2 లో నటించే అవకాశం..!!

-

పుష్ప అనే పేరు వినగానే అందరికి చిత్తూరు యాస గుర్తుకు వస్తుంది..ఆ సినిమా హిట్ అవ్వడం తో ఆ యాస మరింత ఫెమస్ అయ్యింది.ఇప్పుడు పార్ట్ 2 ను డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించనున్నారు. మొదటి సినిమాకు మించి ఉండేలా సుక్కు ప్రతిదీ ప్లాన్ వేస్తున్నారు.. పుష్ప2 లో కొత్త నటీనటులకు అవకాశం ఇస్తున్నట్లు ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కోడుతుంది..

ఈ సినిమాలో కొత్త ముఖాలని చూపించాలని ఫిక్స్ అయ్యారు సుకుమార్. అందుకే సినిమాలో నటించేందుకు నటీనటుల ఎంపిక చేస్తున్నారు. దానికోసం ఒక ఆడిషన్ కాల్ కూడా ఏర్పాటు చేశారు. ఏ ఏజ్ గ్రూప్ వారైనా సరే ఈ పుష్ప 2 ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు కాకపోతే ఖచ్చితంగా చిత్తూరు యాస వచ్చి ఉండాలి. ఆ యాసలో మాట్లాడలిగిన ఏ వయసు వారైనా ఆడిషన్స్ లో పాల్గొని సుకుమార్ ని ఇంప్రెస్ చేస్తే పుష్ప 2 లో ప్లేస్ అయినట్టే.

పార్ట్ 2లోనే అసలు కథ ఉందని సుకుమార్ చెప్పాడు. సో ఎలా లేదన్నా పార్ట్ 2 కూడా అంతకుమించి అనిపించేలా ఉంటుందని చెప్పొచ్చు. పుష్ప 2 విషయంలో సుకుమార్ ప్రతిదీ చాలా ఫోకస్ గా చేస్తున్నారు.ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో ఉన్న అందరు ఈ పార్ట్ 2 లో కొనసాగడమే కాకుండా పార్ట్ 2లో కొన్ని కొత్త పాత్రలు కూడా యాడ్ అవుతాయని తెలుస్తుంది. పుష్ప 2 బిజినెస్ విషయంలో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ వందల కోట్లతో వస్తుందట. అయితే నిర్మాతలు మాత్రం ఇంకా బిజినెస్ డీల్స్ ఏర్పాటు చేసుకోలేదని తెలుస్తుంది…మీకు ఈ సినిమా పై ఆసక్తి ఉంటే మీరు ట్రై చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news