ఎమోషనల్ అవుతున్న అల్లు అరవింద్.. ఆమె వల్లేనా..?

-

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా తెలుగులోనే కాదు తమిళ్ , కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో కూడా నిర్మాతగా ఈయనకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ సినిమాలను ఇక్కడ.. ఇక్కడ సినిమాలను అక్కడ రిలీజ్ చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకున్నాడు. అల్లు రామలింగయ్య కుమారుడిగా.. మెగాస్టార్ చిరంజీవి బామ్మర్దిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ ద్వారా ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలు నిర్మిస్తూ పాపులారిటీని దక్కించుకుంటున్నారు. ఇకపోతే ఈయన కుమారులు అల్లు అర్జున్, అల్లు శిరీష్ కూడా హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే ఇటీవల అల్లు అరవింద్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈమె గురించి ఒక ప్రొడ్యూసర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా అరుదు అని కూడా నెటిజన్లు చెబుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన 18 పేజీస్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించిన విషయం తెలిసిందే . డిసెంబర్ 23న రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రమోషన్స్ శరవేగంగా జరుపుకుంటుంది.

ఈ క్రమంలోనే అల్లు అరవింద్ ఈ సినిమాలోని ఏడు రంగుల వాన అనే పాటను విడుదల చేశారు. ఈ క్రమంలోని ఆయన మాట్లాడుతూ.. కార్తికేయ 2 సినిమా తర్వాత అదే జోడితో 18 పేజీస్ సినిమా రావడం చాలా సంతోషంగా ఉంది. హీరో నిఖిల్ చాలా కష్టపడి పనిచేస్తాడు. అనుపమ నటన చాలా సహజంగా ఉంటుంది. అనుపమ నటన అంటే తనకు చాలా ఇష్టమని.. అనుపమను చూసినప్పుడల్లా అలాంటి కూతురు నాకెందుకు లేదు.. ఒకవేళ నాకు ఆమె లాంటి కూతురు ఉంటే బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది అని ఎమోషనల్ అయ్యారు అల్లు అరవింద్. ఇకపోతే హీరోయిన్ ని కూతురుగా భావించి ఇలాంటి కామెంట్లు చేయడంతో ఈయనపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news